తెలంగాణలో లాక్‌డౌన్ అంటూ‌ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్

Fake Lockdown News, Fake Lockdown News by Creating False GO, Hyderabad, Hyderabad Fake Lockdown, Hyderabad Fake Lockdown News, hyderabad lockdown, Hyderabad Police, Hyderabad Police Arrested a Man for Spreading Fake Lockdown News, Man arrested for allegedly spreading fake news, Man Spreading Fake Lockdown News by Creating False GO, Mango News, Police Arrested a Man for Spreading Fake Lockdown News by Creating False GO

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ అంటూ ఇటీవల నకిలీ ఉత్తర్వులు సర్క్యులేట్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదని, సోషల్ మీడియాలో ఉన్న జీవో కాపీ నకిలీదంటూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి‌ సోమేశ్‌ కుమార్‌ వెంటనే ప్రకటన ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసు వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ మీడియాకు వివరించారు. శ్రీపతి సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. అతని స్వస్థలం ఏపీలోని నెల్లూరు జిల్లా అని, సంజీవ్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు.

గతంలో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం జారీ చేసిన జీవోను డౌన్‌లోడ్‌ చేసుకొని, తేదీలు మార్చి వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశాడన్నారు. అతని స్నేహితులు కూడా ఇతర గ్రూప్స్ లోకి షేర్ చేయడంతో వైరల్ అయిందని అన్నారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని, నిర్ధారణ చేసుకోకుండా ప్రచారం చేయవద్దని సూచించారు. తప్పుడు జీవోలను ప్రచారం చేస్తే, చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =