ఇంధన ధరల పెంపుపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Questions Finance Minister Nirmala Sitharaman on Hike of Crude Oil Prices, Minister KTR Questions Finance Minister Nirmala Sitharaman, Minister KTR Questions Finance Minister on Hike of Crude Oil Prices, Hike of Crude Oil Prices, Finance Minister Nirmala Sitharaman, Finance Minister, Nirmala Sitharaman, Crude Oil Prices Hike, Crude Oil Prices Hike Latest News, Crude Oil Prices Hike Latest Updates, Telangana Minister KTR, KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, Mango News, Mango News Telugu,

దేశంలో మరియు రాష్ట్రంలో ఇంధన ధరలను పెంచటంపై మంత్రి కేటీఆర్‌ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు. సెస్‌లు, క్రూడాయిల్‌ ధరలు తగ్గించడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేయడంలేదని, అంతర్జాతీయ విపణిలో ధరలు పెరగటం వలనే దేశంలో కూడా ధరలు పెంచామని కేంద్రప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో చర్చించటానికి ఎందుకు సుముఖత చూపడంలేదని మంత్రి కేటీఆర్,‌ కేంద్రమంత్రి సీతారామన్‌ను అడిగారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాలను తెలిపారు.

చైనీస్‌ టార్చర్‌ గురించి బుక్స్ లో చదివామని, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల్లో 12వ సారి లీటర్‌కు 80 పైసల చొప్పున పెట్రోల్‌ ధరలు పెంచి సరికొత్త రికార్డు సృష్టించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు వ్యాట్‌ను పెంచలేదని గుర్తుచేశారు. కేంద్రపభ్వుతం విపరీతంగా ధరలను పెంచుకుంటూ పోతోందని, ఇది సామాన్యుడిపై మోపలేని భారాన్ని కలిగిస్తోందని అన్నారు. కావున వెంటనే కేంద్రం పెంచిన సెస్సులను తగ్గించాలని, దీనివలన ఇంధన ధరలు 30% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =