టీఎస్ టెట్-2022 హాల్ టికెట్స్ విడుదల, నేటి నుంచే డౌన్‌లోడ్ ప్రారంభం

TS TET-2022 Hall Tickets Download Started from Today, TS TET Hall Ticket 2022 Released, 2022 TS TET Hall Ticket Released, TS TET Admit Card 2022 released, TS TET Hall tickets 2022, Telangana TET Admit Card to be released today, Telangana TET Admit Card, TS TET-2022 Hall Tickets, Telangana TET admit cards likely to be released today, Steps to download TS TET 2022 hall ticket, Ways to download TS TET 2022 hall ticket, All Candidates can download the TSTET hall ticket 2022 now, Telangana Teacher Eligibility Test, All Candidates can download the Telangana Teacher Eligibility Test hall ticket 2022 now, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ను జూన్ 12న నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నేటి (జూన్ 6, సోమవారం) నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టెట్ హాల్ టికెట్స్ ను అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంచారు. ఇక జూన్ 12, ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-I, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-II పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే టెట్ ఫలితాలను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేందుకు టెట్ పరీక్షలో అర్హత సాదించడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడంతో రాష్ట్రప్రభుత్వాలు టెట్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీలో భాగంగా 13,086 సెకండరీ ఎడ్యుకేషన్ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముందుగా పాఠశాల విద్యా శాఖ మార్చి 23న టీఎస్ టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నుండి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. టీఎస్ టెట్-2022 పరీక్షకు హాజరయ్యేందుకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులకు కూడా అవ‌కాశం కల్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 17 =