నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన మంత్రి కేటీఆర్‌, కీలక సూచనలు

Minister KTR Responds Over The Protest of Under Graduate Students in Nizam College,Telangana Minister KTR, KTR Over Protest Under Graduate Students,Nizam College Under Graduate Students,Mango News,Mango News Telugu,KTR Responds To Nizam College,KTR Urges Edu Min Address Nizam Cllg Protest, Telangana Politics Latest News And Updates,Telangana CM KCR, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించారు. హాస్టల్ కేటాయింపుకు సంబంధించి నిజాం కాలేజ్‌ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. క్యాంపస్‌లో నూతనంగా నిర్మించిన హాస్టల్ బిల్డింగ్‌లో యూజీ విద్యార్థినులకు వసతి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాలేజ్ యాజమాన్యం స్పందించకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో విద్యార్థినుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా విద్యాశాఖ మంత్రిని మరియు నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. విద్యార్థినుల కోరిక మేరకు బాలికల హాస్టల్‌ను నిర్మించి కళాశాలకు అప్పగించడం జరిగిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు ఈ అనవసర వివాదం అసంబద్ధంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అలాగే కాలేజీలో తలెత్తిన ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు కూడా మంత్రి కేటీఆర్‌ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 16 =