ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Announced Financial Assistance of One Lakh Rupees to Victims of House Demolitions at Ippatam Village ,Pawan 1Lakh Financial Assistance,Pawan Kalyan Visits Ipatam , Pawan Kalyan Ipatam Village Visit, Power Star Ippatam Village Visit,Mango News,Mango News Telugu,Power Star Pawan Kalyan, PSPK, Power Star,PAwan Kalyan Latest News And Updates,Janasena Party Founder,Janasena Party Chief Pawan Kalyan, Pawan Kalyan News And Live Updates, Tension in Ippatam

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. “ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్లు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మార్చి 14 తేదీన ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి శుక్రవారం నాడు జేసీబీలను పెట్టి, పోలీసులను మోహరింపచేసి ఇళ్ళు కూల్చిన ఘటన తెలిసిందే. ఈ సంఘటన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనట్లు సామాజిక మాధ్యమాల గణాంకాలు తెలియచేస్తున్నాయి” అని నాదెండ్ల మనోహర్ అన్నారు

“ఈ ఘటన జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇళ్లు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. నైతిక మద్దతుతోపాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా వారికీ అందజేస్తారు” అని ప్రకటనలో నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − two =