రైతుబంధు పంపిణీ ప్రారంభం, తొలిరోజు 16.04 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బు జమ

CM KCR Conducted A Review on Distribution of Rythu Bandhu Money,CM KCR,KCR,KCR Review,CM KCR Review,CM KCR Review Meet,CM KCR Review Meet On Rythu Bandhu,Rythu Bandhu Scheme,CM KCR Review Meet On Rythu Bandhu Scheme,Telangana,CM KCR Review On Rythu Bandhu,KCR Review Meeting,KCR Review Meet On Rythu Bandhu Scheme,Hyderabad,Pragathi Bhavan,Latest News,Rythu Bandhu,CM KCR,CM KCR News,CM KCR Latest News,Rythu Bandhu Money,Rythu Bandhu Latest Update,CM KCR on Distribution of Rythu Bandhu Money,Mango News,Mango News Telugu,KCR Review On Rythu Bandhu,CM KCR Review On Rythu Bandhu Scheme,Rythu Bandhu Scheme,Telangana Chief Minister KCR,Telangana,Telangana News

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 9.88 లక్షల ఎకరాలకు సంబంధించి సుమారు 16.04 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.494.11 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ముందుగా రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చారు. రైతులందరికీ డిసెంబర్ 28, సోమవారం నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల పంటసాయంగా అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − five =