అత్యధునాతన సౌకర్యాలతో వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ : మంత్రి వేముల

Construction of Warangal Super Multispeciality Hospital, Mango News, Minister Vemula Prashanth Reddy, Minister Vemula Prashanth Reddy Held Review on Construction of Warangal Super Multispeciality Hospital, Multispeciality Hospital In Warangal, New hospital in Warangal, Vemula Prashanth Reddy Held Review on Construction of Warangal Super Multispeciality Hospital, Warangal jail premises to house 24-storied hospital, Warangal multi-super speciality hospital, Warangal Multispeciality Hospital, Warangal Multispeciality Hospital to be built, Warangal Super Multispeciality Hospital

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్ మరియు ఇతర అంశాలపై ఆర్ అండ్ బి మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో గురువారం నాడు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ లో అత్యధునాతన సౌకర్యాలతో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి వేముల అన్నారు.

భారతదేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిన అనుభవం గల ముగ్గురు ఆర్కిటెక్ లతో గురువారం మంత్రి స్వయంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన అన్ని విభాగాల సమూహంతో కూడిన ఆసుపత్రిగా ఉండే విధంగా ప్లాన్లు తయారు చేయించాలని ఆర్కిటెక్ట్ లకు మంత్రి సూచించారు. మంగళవారంలోగా హాస్పిటల్ డిజైన్స్, ఎలివేషన్ లతో కూడిన ప్లాన్స్ సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖాసీం రిజ్వి, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, టీఎస్ఎంఎస్ఐడీసీ డైరెక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 7 =