మునుగోడు ఉపఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

Munugode By-poll Congress Candidate Palvai Sravanthi Files Nomination Today TPCC Chief Revanth Reddy Attends, Munugode By-poll Palvai Sravanthi Files Nomination, TPCC Chief Revanth Reddy Attends Nomination, Munugode By-poll ,Mango News, Mango News Telugu, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉపఎన్నిక చివరిరోజైన శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి, భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. కాగా ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఐలయ్య గురువారం ప్రకటించారు. ఇక నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చండూరులో భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో భాగంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తొలినుంచీ మునుగోడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలవబోతోందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలిచ్చిందని, కానీ ఆయన తన స్వార్ధం కోసం పార్టీని వదిలి వెళ్లిపోయాడని విమర్శించారు. ఒక ఆడబిడ్డ ఎన్నికల్లో నిలబడుతుంటే ఓడించడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ కుయుక్తులు పన్నుతున్నాయని, డబ్బుతో గెలవాలని చూస్తున్న టీఆర్ఎస్, బీజేపీని ఓడించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలొచ్చినప్పుడు టీఆర్ఎస్ నేతలు దత్తత మాట చెబుతుంటారని, మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు ఎన్ని దత్తత ప్రాంతాలను అభివృద్ధి చేసారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + one =