హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఒకే విడతలో నవంబర్ 12న పోలింగ్

Election Commission of India Announced Schedule for Himachal Pradesh Assembly General Elections, Election Commission of India, Himachal Pradesh Assembly General Elections, Schedule for Himachal Pradesh Assembly Elections, Mango News, Mango News Telugu, Himachal Pradesh Assembly Elections, EC Himachal Pradesh Assembly General Elections, EC Himachal Pradesh Assembly Elections, Assembly Elections Schedule Released, Himachal Pradesh Assembly Election 2022, Himachal Pradesh Assembly Elections On November 12, Himachal Pradesh Poll , 2022 Assembly Elections Updates

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు (అక్టోబర్ 14, శుక్రవారం) విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్ కుమార్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు గానూ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నవంబర్ 12వ తేదీన 68 స్థానాలకు పోలింగ్ జరగనుందని తెలిపారు. అలాగే డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.

ఈ రోజు నుంచే హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన కోవిడ్-19 గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఓటర్లు సంఖ్య 55,07,261, సర్వీస్ ఓటర్ల సంఖ్య 67,532 కలిపి మొత్తం 55,74,793 ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాగా ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు 2023, జనవరి 8వ తేదీతో ముగియనుంది.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 17
  • నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు: అక్టోబర్ 25
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29
  • అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 12
  • ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల తేదీ: డిసెంబర్ 8.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − four =