నాగార్జునసాగర్‌: 7 రౌండ్ల తర్వాత 6532 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్

Nagarjunasagar Assembly By-election Counting Live Updates,Nagarjuna Sagar Assembly By-election Counting Live,Nagarjuna Sagar Assembly By-election,Nagarjuna Sagar By-election Updates Live,Mango News,Mango News Telugu,Nagarjuna Sagar By-Election Counting,Nagarjuna Sagar By-Election Counting Updates,By Poll Results live,Nagarjuna Sagar bypolls,By Poll Results live Updates,By Poll Results live Latest,By Poll Results Counting live,Nagarjuna Sagar By-Election Latest News,Nagarjuna Sagar By-Election News,Nagarjuna Sagar By-Election Live,Nagarjuna Sagar By Poll Results live,Nagarjuna Sagar Bypoll Result LIVE,Nagarjuna Sagar Bypoll 2021 Results LIVE Updates,Nagarjuna Sagar Election Result 2021

నాగార్జునసాగ‌ర్ ఉపఎన్నిక ఫ‌లితాల్లో కారు హవా కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ 6532 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 4022, కాంగ్రెస్‌కి ‌2,607, బీజేపీకి 827 ఓట్లు లభించాయి. 7 రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ కు మొత్తం 27084, కాంగ్రెస్‌ కి ‌20552, బీజేపీకి 2112 ఓట్లు లభించాయి. మరో 18 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. నల్గొండలోని ఆర్జాలబావి వద్ద ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబు‌ళ్లపై లెక్కింపు జరుగుతుంది. మొత్తం 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. అలాగే 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. తుదిపలితం సాయంత్రం 4 గంటలలోగా వెలువడే అవకాశం ఉంది.

నాగార్జునసాగర్ పోరులో 41 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ తరపున సీనియర్‌ నాయకుడు జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పానుగోతు రవికుమార్ ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =