పదో తరగతిలో పాఠ్యాంశంగా ఎన్టీఆర్ చ‌రిత్ర‌, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ

#KCR, Balakrishna, Balakrishna Latest News, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna Says Thanks to CM KCR, NTR, NTR History as Lesson in Tenth Class, NTR History as Tenth Class Lesson, NTR life as a lesson for 10th class students, NTR Story for 10th class students, Telangana CM KCR, Telangana Tenth Syllabus

ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాన్ని భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా పాఠ్యాంశంగా చేర్చడం పట్ల బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తూ, తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు. అలాగే ఎన్టీఆర్ కు సంబంధించిన పాఠ్యాంశ ఫొటోల్ని కూడా ఆయన షేర్‌ చేశారు.

“కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + fourteen =