తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

High Court Stay On Telangana Secretariat Demolition,Mango News,High Court Stays Demolition of Secretariat Errum Manzil Palace,High Court asks Telangana govt to file counter on secretariat demolition,Telangana High Court Refuses to Stay Demolition of Secretariat,High Court Shock To Telangana Government On Telangana Secretariat Demolition,High Court to Hear Petition On Telangana Secretariat Demolition Today,High Court Rejects Stay Order For TS Assembly Buildings Demolition

జూన్ 24, 2019 న తెలంగాణలోని సచివాలయం మరియు ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల అనుగుణంగా, సచివాలయం మరియు ఎర్రమంజిల్ లో భవనాల నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని పిటిషనర్ కోర్టును కోరారు. సోమవారం విచారణ సందర్బంగా, సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అంతే కాకుండా కౌంటర్ దాఖలు చేసే వరకు భవనాల కూల్చివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కూడా ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వ న్యాయవాది, హైకోర్టు ప్రతిపాదన అంగీకరించి కౌంటర్ దాఖలుకు 15 రోజుల సమయం కావాలని కోర్టును కోరారు, అయితే, కోర్టు ఆ విజ్ఞప్తిని వ్యతిరేఖించి ఈ రోజే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది, మధ్యాహ్నం వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ తరపు లాయర్ వెల్లడించగా, దీంతో కోర్టు మధ్యాహ్ననికి వాయిదా పడింది.

ఇటీవలే ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో, కొత్త సచివాలయం మరియు ఎర్రమంజిల్ ప్రాంతంలో కొత్త అసెంబ్లీ నిర్మాణాలపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే, అంతే కాకుండా జూన్ 27 న శాసనసభ్యులు, మండలి సభ్యులుతో కలిసి కొత్త సచివాలయం నిర్మాణానికి సీఎం కెసిఆర్ భూమిపూజ కూడా నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − sixteen =