దేశవ్యాప్తంగా రేపు నీట్ పరీక్ష.. ఎన్టీఏ కీలక నిర్ణయం, సమయం 20 ని. పొడిగింపు

NEET 2022 Exam will be Conducted Tomorrow NTA Extends Time Upto 20 Minutes, NTA Extends Time Upto 20 Minutes, NEET 2022 Exam will be Conducted Tomorrow, NEET Exam will be Conducted Tomorrow, NEET 2022 Exam, 2022 NEET Exam, NEET Exam, NEET UG 2022 Exam tomorrow, NEET 2022 will be held tomorrow, duration of the NEET UG 2022 Examination will be 200 minutes, NEET UG 2022 Examination duration will be 200 minutes, NEET UG 2022 entrance exam will be held on July 17, NEET 2022 exam timing has been extended from 3 hours to 3 hours 20 minutes, NEET 2022 Exam News, NEET 2022 Exam Latest News, NEET 2022 Exam Latest Updates, NEET 2022 Exam Live Updates, Mango News, Mango News Telugu,

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2022 పరీక్షను ఎన్టీఏ జూలై 17 (ఆదివారం) నిర్వహించనుంది. సుమారు 18 లక్షల మంది అభ్యర్థులు రేపు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాలలో 2022-23 మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరవనున్నారు. అగ్రశ్రేణి వైద్య సంస్థలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో ఎంబిబిఎస్ లేదా బిడిఎస్ సీటు పొందడం కోసం ఈ నీట్ 2022ని ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా సమయాన్ని 20 ని. పొడిగించింది. దీంతో అభ్యర్థులకు కొంత వెసులుబాటు కలుగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గం. నుంచి 5:20 వరకూ పరీక్ష జరుగనుంది. కాగా తెలంగాణాలో సుమారు 115 కేంద్రాలలో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అలాగే పరీక్షకు హాజరవునున్న అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తన అధికారిక వెబ్‌సైట్ – neet.nta.nic.inలో జారీ చేసిన నోటీసులో, రేపు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కోసం కొన్ని మార్గదర్శకాలను పేర్కొంది. ఎన్టీఏ ఇప్పటికే జూలై 12న అభ్యర్థుల కోసం neet.nta.nic.inలో నీట్ యూజీ 2022 అడ్మిట్ కార్డ్‌లను జారీ చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకుని, దాని ప్రింట్‌అవుట్‌ను తమతో పాటు సంబంధిత పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు. హాజరు షీట్‌లో ఉంచడానికి పాస్‌పోర్ట్ సైజు ఫోటో లేదా అదనపు ఫోటో తీసుకువెళ్లాలి. మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, మైక్రోఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచీలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. అభ్యర్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు కనీసం ఒక 50 ml బాటిల్ హ్యాండ్ శానిటైజర్ వెంట తెచ్చుకోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =