నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021: ప్రధాన రాష్ట్రాల విభాగంలో తెలంగాణకు రెండో ర్యాంక్

NITI Aayog Released India Innovation Index 2021 Telangana Gets 2nd Rank in Major States Category, India Innovation Index 2021 Telangana Gets 2nd Rank in Major States Category, NITI Aayog Released India Innovation Index 2021, India Innovation Index 2021, NITI Aayog, Major States Category, Telangana Gets 2nd Rank, National Institution For Transforming India, 2021 India Innovation Index, India Innovation Index, Telangana Gets 2nd Rank in India Innovation Index 2021, NITI Aayog Says Karnataka And Telangana And Haryana top 3 states in innovation, Karnataka And Telangana And Haryana top 3 states in innovation, India Innovation Index 2021 News, India Innovation Index 2021 Latest News, India Innovation Index 2021 Latest Updates, India Innovation Index 2021 Live Updates, Mango News, Mango News Telugu,

నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021ను గురువారం ఉదయం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ విడుదల చేశారు. నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ యొక్క మూడవ ఎడిషన్‌లో కర్ణాటక, మణిపూర్ మరియు చండీగఢ్‌లు ఆయా విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ప్రధాన రాష్ట్రాల విభాగంలో కర్ణాటక మళ్లీ అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక హర్యానా మూడో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 9వ ర్యాంక్ లో నిలిచింది. అలాగే నార్త్ ఈస్ట్ అండ్ హిల్ స్టేట్స్ విభాగంలో మణిపూర్ అగ్రస్థానంలో, ఉత్తరాఖండ్, మేఘాలయ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు మరియు నగర రాష్ట్రాలు విభాగంలో చండీగఢ్ అగ్రస్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో నిలిచాయి.

నీతి ఆయోగ్ మరియు ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ ద్వారా తయారు చేయబడిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది దేశం యొక్క ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ యొక్క ఎవాల్యూషన్ మరియు అభివృద్ధి కోసం ఒక సమగ్ర సాధనం. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికి వారి ఆవిష్కరణ పనితీరుపై ర్యాంక్‌లు ఇస్తుంది. మూడవ ఎడిషన్ ను గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ ఇండెక్స్‌ సూత్రాలకు అనుగుణంగా రూపకల్పన చేశామని, సూచికల సంఖ్య 36 (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో) నుండి 66కి (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021లో) పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీతో పాటుగా సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్, సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్, సీనియర్ అడ్వైజర్ నీరజ్ సిన్హా, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ చైర్మన్ డాక్టర్ అమిత్ కపూర్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + twenty =