ఫిబ్రవరి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

Registration Charges, Registration charges hike, Registration charges to be increased in Telangana, Registration Charges will be Increased, Registration Charges will be Increased From February, Registration Charges will be Increased From February in Telangana, telangana, Telangana Govt, Telangana to hike user charges for all registration services

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాలు విలువను 35 శాతం, అపార్టుమెంట్లు విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో పాటు బహిరంగ మార్కెట్లో విలువలు భారీగా ఉన్నచోట అవసరమైన మేరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్ విలువల్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఏడేళ్ల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలను కూడా ప్రభుత్వం పెంచింది. దాదాపు 20 శాతం మేర వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువలను సవరించింది. తాజాగా మరోసారి మార్కెట్ విలువ, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపుపై గురువారం రిజిస్ట్రేషన్ శాఖ సమావేశాన్ని నిర్వహించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, సంయుక్త ఐజీలు జిల్లా రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశాల్లో మార్కెట్ విలువల్ని ఏమేరకు సవరించాలన్న విషయమై కసరత్తు నిర్వహించారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =