కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

BRS, Parliamentary meeting, KCR, BRS Parliamentary meeting chaired by KCR.. Discussion on key issues, KCR, BRS, KTR, Harish Rao, Lok sabha elections, Key issues, Telangana CM KCR, BRS Parliamentary Party, BRS Parliamentary Party Meeting, Mango News Telugu, Mango News, Telangana News, Telangana Political News
KCR, BRS, KTR, Harish Rao, Lok sabha elections

తెలంగాణలో బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ప్రగతి భవన్‌ను విడిచి తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు గులాబీ బాస్ కేసీఆర్. ఆ తర్వాత రెండు, మూడు రోజులకు ఫామ్‌హౌజ్‌లో కాలుజారి పడడంతో ఆయన తుంటికి గాయమయింది. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు రెండు నెలలు పూర్తికావస్తోంది కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండి.

అయితే మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశమొత్తం లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో అయినా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ప్రస్తుతం చేతిలో అధికారం లేదు కాబట్టి.. మెజార్టీ ఎంపీ స్థానాలను దక్కించుకొని ఢిల్లీలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఇన్నిరోజులు జనాలకు దూరంగా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ఇక త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు జరగనున్న క్రమంలో.. తమ పార్టీ ఎంపీలతో తన ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి సమావేశాల్లో గట్టిగా ప్రశ్నించాలని సూచించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ బలంగా ఉందని.. ఎవరి అవసరం లేకుండానే పోరాడగలమని.. అలాగే పోరాడి చూపిద్దామని కేసీఆర్ ఎంపీలకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + eighteen =