సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

Six Persons Including Four Women Lost Lives in Massive Fire Mashup at Swapnalok Complex Secunderabad,Six Persons Lost Lives in Fire Mashup,Massive Fire Mashup at Swapnalok Complex,Swapnalok Complex Secunderabad,Four Women Lost Lives in Massive Fire Mashup,Mango News,Mango News Telugu,6 Lost Life In Swapnalok Complex,Massive fire breaks out at Secunderabad,4 Women Among 6 Killed in Secunderabad,6 Suffocate to Death in Massive Fire Mashup,Six Perish in Massive Blaze,Secunderabad Latest News,Secunderabad Fire Mashup News Today,Secunderabad Swapnalok Complex Live News

సికింద్రాబాద్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని నాలుగు అంతస్థులకు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు భయాందోళనకు లోనయ్యారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటలపాటు శ్రమించి 13 మందిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. అయితే దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక వారిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా సికింద్రాబాద్‌ రెజిమెంటల్ బజార్‌లో గల స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ఒక కాల్‌ సెంటర్‌లో పని చేస్తున్న వీరు మంటలు చెలరేగిన వెంటనే తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఓ గదిలో దాక్కున్నారు. ఈ క్రమంలో అంతకంతకూ మంటల తీవ్రతతో పాటు దట్టమైన పొగ వలన ఉక్కిరిబిక్కిరైన వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసిన తర్వాత ఫైర్, రెస్క్యూ సిబ్బంది భవనాన్ని తనిఖీ చేస్తుండగా ఓ గదిలో ఆరుగురు స్పృహ కోల్పోయి ఉండటన్ని గుర్తించారు. వెంటనే వారికి సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మృతి చెందిన వారిని ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి, ప్రశాంత్‌, శివలుగా గుర్తించారు. అలాగే మృతులంతా ఒకే చోట పని చేస్తున్నట్లు సమాచారం.

ఎనిమిది అంతస్తుల్లో ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రైవేట్ కార్యాలయాలు కలిపి మొత్తం 150 వరకు ఉన్నాయి. దీంతో కాంప్లెక్స్‌లో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే మంటలు చెలరేగిన వెంటనే కాంప్లెక్స్‌లో పనిచేసే వారు, షాపింగ్ కోసం వచ్చిన వారు వెంటనే కిందకు దిగిపోయారు. ఈ క్రమంలో ఐదో అంతస్తులో పేలుళ్లతో కొందరు కిందకు రాలేకపోయారు. భవనంలో 15మందికి పైగా చిక్కుకుని పోవడంతో వారిని క్రేన్ల సాయంతో కిందకు దించారు. ఇక అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అలాగే ఇంచార్జి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ మరియు డీసీపీ చందనా దీప్తిలు డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =