స్వతంత్ర భారత వజ్రోత్సవాలు: ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటిన మంత్రి తలసాని, ఎంపీ కేశవరావు

Swatantra Bharatha Vajrotsavalu Minister Talasani Srinivas MP Keshav Rao Planted Saplings in Freedom Park, MP Keshav Rao Planted Saplings in Freedom Park, Telangana Minister Talasani Srinivas Planted Saplings in Freedom Park, Minister Talasani Srinivas Planted Saplings in Freedom Park, Talasani Srinivas Planted Saplings in Freedom Park, Saplings in Freedom Park, Swatantra Bharatha Vajrotsavalu, Telangana Swatantra Bharatha Vajrotsavalu, MP Keshav Rao, Telangana Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav, Telangana Minister, Swatantra Bharatha Vajrotsavalu News, Swatantra Bharatha Vajrotsavalu Latest News, Swatantra Bharatha Vajrotsavalu Latest Updates, Swatantra Bharatha Vajrotsavalu Live Updates, Mango News, Mango News Telugu,

ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం లభించిందని, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ లు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 15 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు.

అందులో భాగంగా నగరంలోని 75 ప్రాంతాలలో ఫ్రీడమ్ పార్క్ లను ఏర్పాటు చేసి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. విరివిగా మొక్కలను నాటడం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం జరుగుతుందని వివరించారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గురించి విద్యార్థులకు తెలియజెప్పేందుకు రాష్ట్రంలోని 563 స్క్రీన్ లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దేశ సమైక్యతను చాటి చెప్పే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 16వ తేదీన నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో అందరూ పాల్గొనాలని మంత్రి తలసాని శ్రీనివాస్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 7 =