తెలంగాణలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు, కమిటీ నిర్ణయాలివే…

Swathantra Bharatha Vajrotsavalu in Telangana Committee Takes Several Decisions, Committee Takes Several Decisions, Swathantra Bharatha Vajrotsavalu in Telangana, Telangana Swathantra Bharatha Vajrotsavalu, Swathantra Bharatha Vajrotsavalu, Swathantra Bharatha Vajrotsavalu in Telangana in the context of the 75 years of India's Independence, 75 years of India's Independence, Har Ghar Tiranga, Swatantra Bharat Vajrotsavalu campaigns, Telangana Har Ghar Tiranga, Swathantra Bharatha Vajrotsavalu News, Swathantra Bharatha Vajrotsavalu Latest News, Swathantra Bharatha Vajrotsavalu Latest Updates, Swathantra Bharatha Vajrotsavalu Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై ఏర్పాటైన కమిటీ శుక్రవారం నాడు కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.కేశవరావు నేతృత్వంలో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా జి.ఎ.డి విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. 15 రోజుల ఉత్సవ కార్యాచరణ రూపొందించేందుకు కమిటీ సభ్యులు, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా.కె.వి.రమణా చారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సమావేశంలో పాల్గొన్నారు.

ఉత్సవాల నిర్వహణపై సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:

  • రాష్ట్రంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం (ఆగస్టు 15న)
  • హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన భవనాలు, స్మారక చిహ్నాల వద్ద విద్యుత్ దీపాలంకరణ
  • ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు
  • స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్ర సమరయోదుల, జాతీయ నాయకుల చిత్రాలతో హోర్డింగ్‌లు మరియు బిల్-బోర్డ్‌ ల ప్రదర్శన
  • ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ – సినిమా హాళ్లలో, పాఠశాలలు/కళాశాలల్లో దేశభక్తి చిత్రాల ప్రదర్శన
  • జానపద పాటలు, నృత్యాలు, నిర్వహణ
  • పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్‌ల పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పెరేడ్
  • స్వాతంత్య్ర పోరాటంపై పెయింటింగ్, ప్రదర్శనలు-ర్యాలీలు
  • ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహము వద్ద జెండాలు, ప్లకార్డులతో విద్యార్థులచే ర్యాలీ. సంజీవయ్య పార్క్, జాతీయ జెండా స్తంభం వరకు ఎంసీహెచ్ సిబ్బందితో ర్యాలీ
  • త్రివర్ణ బెలూన్‌లను ఎగురవేయడానికి పెద్ద మైదానంలో సమ్మేళనం
  • స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ నాయకుల విగ్రహాలకు నివాళులర్పిస్తూ పూలమాలల అలంకరణ
  • ప్రధాన జంక్షన్ల వద్ద జాతీయ గీతాలాపన చేయడం–ఒక రోజు కార్యక్రమం
  • 2-K ఫ్రీడమ్ రన్ మరియు సైకిల్ రన్
  • దీప నీరాజనం-దీపాలను వెలిగించడం
  • జాతీయ సమైక్య రక్షా బంధన్ (రాఖీ పూర్ణిమ)
  • కాలనీల శుభ్రత కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనుట
  • కవి సమ్మేళనం మరియు ముషాయిరా
  • ఎస్ హెఛ్జీలు, మహిళలతో రంగోలి కార్యక్రమం.
  • పుస్తక ప్రదర్శన
  • ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, సైక్లింగ్ క్లబ్, ఎస్ హెఛ్జీలు, కళాశాలలు, స్పోర్ట్స్ క్లబ్‌ లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, కో-కో ఆటలు, క్రీడల పోటీల నిర్వహణ
  • రవీంద్ర భారతిలో 15 రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు
  • ఆసుపత్రులలో పేషంట్లకు పండ్ల పంపిణీ
  • బీటింగ్ రిట్రీట్
  • ముగింపు కార్యక్రమంలో ప్రతి జిల్లా నుండి 1000-2000 మంది వాలంటీర్లు ర్యాలీగా ఎల్‌.బి.స్టేడియం వద్దకు చేరుకుంటారు.
  • ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 8న హైటెక్స్ లో వేడుకలను ప్రారంభిస్తారు, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 22న ఎల్‌.బి.స్టేడియంలో ముగింపు కార్యక్రమం.
  • రాష్ట్ర మంత్రులు కె.టి. రామారావు, టి.శ్రీనివాస్ యాదవ్, పి.సబితా ఇంద్రా రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో ఏర్పాట్లను సమన్వయం చేస్తారు.
  • ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదం లభించిన తర్వాత తదుపరి కార్యక్రమం ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + ten =