కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో రెండోరోజు భారత్ షెడ్యూల్ ఇదే…

Commonwealth Games-2022 Day 2 Full Schedule of Indian Contingent, Commonwealth Games Day 2 Full Schedule of Indian Contingent, Full Schedule of Indian Contingent, Commonwealth Games-2022 Day 2, Indian Contingent Full Schedule, Indian Contingent, Lawn Bowls India in Men's Triple; Tania Choudhury in Women's singles, Athletics Nitendra Singh Rawat in Men's Marathon Final, Badminton India's Mixed Team Group A tie against Sri Lanka, 2022 Commonwealth Games Day 2 Live Updates, Commonwealth Games Day 2 Live Updates, Birmingham Commonwealth Games 2022, 2022 Birmingham Commonwealth Games, Birmingham Commonwealth Games, Commonwealth Games, Birmingham Alexander Stadium, Commonwealth Games 2022 sports, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో తొలిరోజున భారత్‌ బృందం మెరుగ్గా రాణించింది. తొలి రోజున పతకం సాధించనప్పటికీ, వివిధ క్రీడా ఈవెంట్స్ లో భారత్ అథ్లెట్లు సత్తాచాటారు. స్విమ్మింగ్ లో పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో భారత్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్ చేరాడు. పూల్‌-ఎలో తమ తొలి మ్యాచ్‌లో భారత్ మహిళల హాకీ జట్టు ఘనా జట్టును 5-0తో ఓడించింది. బ్యాడ్మింటన్ లో భారత్ మిక్స్‌డ్ టీమ్ గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో 5-0 తేడాతో పాకిస్థాన్‌ ను చిత్తుచేసింది. టేబుల్‌ టెన్నిస్‌లో భారత్ జట్లు మరోసారి ఆధిపత్యాన్ని సాధించాయి. భారత్ మహిళల జట్టు గ్రూప్‌-2 తొలి మ్యాచ్ లో 3-0తో దక్షిణాఫ్రికాను, గ్రూప్-2 రెండో మ్యాచ్ లో 3-0తో ఫిజీని చిత్తుచేసింది. డబుల్స్‌లో శ్రీజ-రీత్‌, సింగిల్స్‌లో మనిక బాత్రా, శ్రీజ విజయం సాధించారు.

ఇక టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల విభాగంలో గ్రూపు-3 తోలి పోరులో భారత్‌ 3-0తో బార్బడోస్‌ పై, రెండో మ్యాచ్ లో 3-0తో సింగపూర్ పై గెలిచింది. డబుల్స్‌లో హర్మీత్ దేశాయ్-సాథియాన్ జ్ఞానశేఖరన్, సింగిల్స్‌లో శరత్ కమల్ ఆచంట, సాథియాన్ జ్ఞానశేఖరన్ విజయం సాధించారు. స్క్వాష్ లో జో చాప్‌మన్‌తో జరిగిన మొదటి రౌండ్‌లో అభయ్ సింగ్ 3-0తో సునాయాసంగా గెలిచాడు. అలాగే భారత్ క్రీడాకారిణి అనాహత్ సింగ్ జడా రాస్‌తో జరిగిన మొదటి రౌండ్‌లో 3-0తో సునాయాసంగా గెలిచింది. మరోవైపు క్రికెట్ లో భారత్ మహిళా జట్టు తోలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయింది. ఇక రెండో రోజైన శనివారం నాడు వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పతకం సాధించే అవకాశం ఉంది.

కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో రెండోరోజు భారత్ షెడ్యూల్ ఇదే:

  • లాన్ బౌల్స్ – పురుషుల ట్రిపుల్‌లో భారత్ × మాల్టా (మధ్యాహ్నం 1 గంటకు), మహిళల సింగిల్స్‌లో తానియా చౌదరి vs లారా (వేల్స్‌) (మధ్యాహ్నం 1 గంటకు), మెన్స్ పెయిర్‌ – భారత్‌ vs కుక్‌ ఐస్‌ల్యాండ్స్‌ (రాత్రి 7.30 నుంచి); మహిళల ఫోర్‌- భారత్‌ vs కెనడా (రాత్రి 7.30 నుంచి)
  • అథ్లెటిక్స్ – పురుషుల మారథాన్ ఫైనల్‌లో నితేంద్ర సింగ్ రావత్ (మధ్యాహ్నం 1.30 గంటకు)
  • బ్యాడ్మింటన్ – శ్రీలంకతో భారత్ మిక్స్‌డ్ టీమ్ గ్రూప్ A టై (మధ్యాహ్నం 1.30 గంటలకు), భారత్‌ vs ఆస్ట్రేలియా (రాత్రి 11.30 )
  • వెయిట్ లిఫ్టింగ్ : వెయిట్ లిఫ్టింగ్ – పురుషుల 55k విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గర్ (మధ్యాహ్నం 1.30 గంటకు), పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజా (సాయంత్రం 4.15 గంటల నుంచి), మహిళల 49k విభాగంలో మీరాబాయి చాను (రాత్రి 8 గంటల నుంచి), మహిళల 55k విభాగంలో బింద్యారాణి దేవి (రాత్రి 12.30 గంటల నుంచి)
  • టేబుల్ టెన్నిస్ : టేబుల్ టెన్నిస్ – మహిళల జట్టు గ్రూప్ 2లో మూడో రౌండ్ భారత్ vs గయానా, పురుషుల జట్టు గ్రూపు లో మూడో రౌండ్ – భారత్ vs ఉత్తర ఐర్లాండ్
  • సైక్లింగ్ : మహిళల స్ప్రింట్ క్వాలిఫైయింగ్‌లో మయూరి లూట్ మరియు త్రియాషి పాల్ (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి), మహిళల 3000 మీటర్ల వ్యక్తిగత పర్స్యూట్ క్వాలిఫైయింగ్‌లో మీనాక్షి (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి), సైక్లింగ్ – పురుషుల 4000 మీటర్ల ఇండివిజువల్ పర్స్యూట్ క్వాలిఫైయింగ్‌లో విశ్వజీత్ సింగ్ మరియు దినేష్ కుమార్, పురుషుల కీరిన్‌ తొలి రౌండ్‌- అల్బెన్‌ (రాత్రి 8.30 గంటల నుంచి)
  • స్విమ్మింగ్ – 200మీ ఫ్రీస్టైల్ హీట్ 3లో కుశాగ్రా రావత్ (మధ్యాహ్నం 3 గంటల నుంచి)
  • బాక్సింగ్ – 54-57 కేజీల బరువు విభాగంలో హుస్సన్ముద్దీన్ మహ్మద్ (భారత్) vs అమ్జోలీ (సౌత్ ఆఫ్రికా) (రౌండ్ ఆఫ్ 32) (సాయంత్రం 4:30 గంటల నుంచి), 70 కేజీల రౌండ్ 1లో లవ్లినా బోర్గోహైన్ vs ఎన్ అరియన్ (రాత్రి 11 గంటలకు), 92 కేజీల రౌండ్ 1 విభాగంలో సంజీత్ vs అటోలియు అర్ధరాత్రి (1.15 కు)
  • స్క్వాష్ – పురుషుల సింగిల్స్ రౌండ్ 32లో రమిత్ టాండన్ మరియు సౌరవ్ ఘోసల్, మహిళల సింగిల్స్ రౌండ్ 32లో జోష్నా చినప్ప, సునయన సారా కురువిల్లా (సాయంత్రం 4.30 గంటల నుంచి 7 గంటల వరకు)
  • జిమ్నాస్టిక్స్ – మహిళల టీమ్ ఫైనల్ మరియు వ్యక్తిగత అర్హత సబ్‌డివిజన్ 3లో ప్రణతి నాయక్, రుతుజ నటరాజ్ మరియు ప్రొటిష్ట సమంత (రాత్రి 9 గంటల నుంచి)
  • హాకీ – మహిళల పూల్ Aలో భారత్ vs వేల్స్ (రాత్రి 11.30 గంటల నుంచి).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =