తెలంగాణలో అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు విడుదల

Hyderabad And Telangana Theatres To Reopen, Telangana schools opening, Telangana Schools Reopen, Telangana Theatres, Telangana Theatres To Reopen, Telangana Unlock 5, Telangana Unlock 5 Guidelines, Telangana Unlock 5 News, Telangana Unlock 5 Updates, Telangana unlockdown guidelines

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అనుమతి ఇచ్చే కార్యకలాపాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు మరియు కోచింగ్ సంస్థలు తెరిచే తేదీపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయబడతాయని పేర్కొన్నారు. అలాగే సినిమా థియేటర్స్/మల్టీప్లెక్స్/ఎంటర్టైన్మెంట్ పార్కులు ప్రారంభ తేదీకి సంబంధించి కూడా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయబడతాయని పేర్కొన్నారు.

తెలంగాణలో అమలు కానున్న అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు:

  • రీసెర్చ్ స్కాలర్స్, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులను అక్టోబర్ 15వ నుంచి ల్యాబ్స్ లో ప్రయోగాలు చేసుకునేందుకు అనుమతి.
  • కాలేజీలు/విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ క్లాసులు, దూర్యవిద్యను ప్రోత్సహించాలి మరియు కొనసాగించాలి.
  • ప్రభుత్వం జారీ చేసే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) కు అనుగుణంగా అక్టోబర్ 15 నుంచి క్రీడాకారులు ట్రైనింగ్ కోసం వాడే స్విమ్మింగ్ పూల్స్ కు అనుమతి.
  • అక్టోబర్ 15 నుంచి బిజినెస్ టూ బిజినెస్ ఎగ్జిబిషన్స్ కు అనుమతి.
  • ఇక కంటైన్మెంట్ వెలుపల ప్రాంతాల్లో సామాజిక/విద్య/క్రీడలు/వినోదం/సాంస్కృతిక/మత/రాజకీయ వేడుకలు సహా ఇతర సమావేశాలకు 100 మందితో జరుపుకునేందుకు అనుమతి.
  • ఫేస్ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్కానింగ్ మరియు హ్యాండ్ వాష్/శానిటైజర్ సదుపాయం వంటి హెల్త్ ప్రోటోకాల్ ను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
  • వివాహాలు, అంత్యక్రియల వంటి కార్యక్రమాలల్లో పాల్గొనేందుకు 100 మందికి అనుమతి. అంతకంటే ఎక్కువగా హాజరయ్యే పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్‌/ స్థానిక పోలీసులు/ సంబంధిత అధికారుల తప్పనిసరిగా తీసుకోవాలి.
  • 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు అత్యవసర, వైద్య సంబంధిత అవసరాల కోసం బయటకు రావడం తప్ప, ఇళ్లల్లోనే ఉండడం మంచిదని సూచించారు.
  • అన్ని కంటైన్‌మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ వర్తిస్తుంది. ఆ ప్రాంతాల్లో అవసరమైన కార్యకలాపాలు మాత్రమే అనుమతించబడతాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =