తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి

Telangana Bjp Chief Bandi Sanjay Announces Bjp Will Contest Alone In Next Elections,Telangana Bjp Chief Bandi Sanjay,Bandi Sanjay Announces Bjp Next Elections,Bjp Contest Alone In Next Elections,Mango News,Mango News Telugu,Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,Telangana News Covid,Telangana News Live,Telangana News Today,Telangana News Today In English,Telangana News Today In Telugu,Telangana Chief Minister Kcr,Telangana Cm Kcr,Telangana Cm Kcr Twitter Live Updates,Telangana Cm Party,Telangana State Cm Kcr,Farmers Telangana Cm Kcr,Ktr Latest News,Kalavakuntla Kavitha News,T Harish Rao Latest News And Updates,Telangana State Welfare Schemes,Telangana State Governer,Tpcc Chief Revanth Reddy,Telangana Bjp Chief Bandi Sanjay Kumar,Ysrtp Cheief Ys Sharmila

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ మద్దతివ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారని అన్నారు. అయితే ఆయన అధికారం చేపట్టాక ప్రజలకు చేసిందేమీ లేదని, వారి కుటుంబంలోని వారికి మాత్రం పదవులు వచ్చాయని విమర్శించారు. ఇక ఈ తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేది బీజేపీ ఒక్కటేనని పేర్కొన్న సంజయ్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

ఇక తెలంగాణలో రోజుకో అత్యాచారం జరుగుతోందని, కేసీఆర్ హాయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేస్తామని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలను కన్నెతి చూడాలంటే ఆకతాయిలు వణకాలని, మహిళలపై అత్యాచారాలు చేసే వారి ఇళ్లను బుల్డోజర్స్‌తో కూల్చుతామని తెలిపారు. ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేసి మహిళలకు గౌరవం తెచ్చిన ఘనత ప్రధాని మోదీదేనని, తన కేబినెట్‌లో ఎనిమిది మంది మహిళలకు మంత్రులుగా ఆయన అవకాశం కల్పించారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం‌ లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే బీజేపీ మహిళా విభాగం బలంగా ఉందని బండి సంజయ్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =