టీడీపీ అధికారంలోకి వస్తే విద్యా దీవెనను రద్దు చేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తాం – నారా లోకేష్

Nara Lokesh Says If Tdp Comes To Power We Will Cancel Vidya Deevena Scheme And Pays Fees Directly To Colleges,Nara Lokesh Says Tdp Comes To Power,Nara Lokesh Will Cancel Vidya Deevena Scheme,Nara Lokesh Says Fees Directly To Colleges,Mango News,Mango News Telugu,Ap Cm Ys Jagan Mohan Reddy,Tdp Chief Chandrababu Naidu,Janasena Chief Pawan Kalyan,Ap Bjp Chief Somu Verraju,Ysr Congress Party,Telugu Desam Party,Janasena Party,Bjp Party,Ysr Party,Tdp Party,Jsp Party,Ap Politics,Ap Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News And Live Updates, Andhra Pradesh Latest Investments, Andhra Pradesh Politics,Ap Governer,Ap Cabinet Minister,Ap Ministers,Andhra Pradesh Welfare Schemes,Ap Cm Jagan Latest News And Live Updates

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నెలరోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యాత్ర తిరుపతిలో కొనసాగుతున్న క్రమంలో యువగళం పాదయాత్రలో భాగంగా ఇర్రంగారిపల్లిలో చంద్రగిరి యువతతో నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చిన నారా లోకేష్, వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఏం చేస్తుందో వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ‘జగనన్న వసతి దీవెన’ మరియు ‘జగనన్న విద్యా దీవెన’ పథకాలను రద్దు చేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక పక్కరాష్ట్రాలకు తరలిపోతున్న నిరుద్యోగ యువతను ఆదుకుంటామని, వీరికోసం జనవరి 1, 2025న తొలి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఇదే క్రమంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం పదో తరగతి వరకు ఉచిత బస్సు పాస్ ఇస్తున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే పీజీ వరకు ఉచిత బస్సు పాస్ అందజేస్తామని నారా లోకేష్ తెలియజేశారు. అలాగే ఇప్పుడు కేజీ నుంచి పీజీ వరకు అమలవుతున్న స్టేట్ బోర్డ్ సిలబస్‌లో పూర్తిగా మార్పులు చేసి విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు. పాలసీలు అనేవి నాలుగు గోడల మధ్య తీసుకునేవి కావని, పాలసీల వలన ప్రజలకు చెడు జరగకుండా ఉండాలంటే ప్రజల మధ్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు మహిళను గౌరవించడం అనేది విద్యా బోధనలో భాగం కావాలని, ఇక నెల రోజుల పాదయాత్ర తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని వెల్లడించారు. ఏపీలో ప్రజాపాలన రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, వచ్చే ఎన్నికల్లో యువత తమ ఓటు నమోదుపై దృష్టి పెట్టాలని నారా లోకేష్ పిలుపు నిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 15 =