డ్రగ్స్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ సవాల్‌కు స్పందించిన బండి సంజయ్‌, సంచలన వ్యాఖ్యలు

Telangana BJP Chief Bandi Sanjay Responds Over Minister KTR's Challenge in Narcotics Allegations,Megastar Chiranjeevi Birthday Wishes to CM Jagan,TDP leader Chandrababu,Jana Senani Pawan Kalyan,Wished CM Jagan on His Birthday,Mango News,Mango News Telugu,YSRCP Organises Grand Events,YS Jagan Mohan Reddy Birthday,YS Jagan Birthday,Mango News,YSRCP Organises Jagan Birthday Events,YSRCP Jagan Birthday Events,YSRCP Jagan Events Birthday,YS Jagan Mohan Reddy Birthday,YS Jagan Birthday,Y. S. Jagan Mohan Reddy,AP Latest News and Updates,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy, Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణలను సంజయ్ నిరూపించాలని, లేని పక్షంలో కరీంనగర్ చౌరస్తాలో ఆయనకు చెప్పు దెబ్బలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి సవాల్‌కు బీజేపీ చీఫ్ స్పందించారు. ఈ అంశంపై బుధవారం సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ .. ఏడాది క్రితం ఛాలెంజ్‌ చేస్తే ఇప్పుడు స్పందిస్తారా? పరీక్షకు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? రాకుండా ఎవరు అడ్డుపడ్డారు? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, ఆయన ఆందోళన చెందుతున్నట్లు మోహంలో కనిపిస్తోందని అన్నారు. ఇక డ్రగ్స్ టెస్ట్ చేయాలంటే వినియోగించిన 90 రోజుల్లోపు పరీక్ష చేయాలని, అయితే డ్రగ్స్ కేసులో దొరక్కుండా ఉండేందుకు వేరే దేశం వెళ్లి కేటీఆర్ 3 నెలలు చికిత్స తీసుకున్నాడని ఆరోపించారు. ఇక హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ విచారణ ఎంతవరకూ వచ్చిందని, ఎందుకు దానిని నిలిపివేశారని ప్రశ్నించిన సంజయ్.. ఈ కేసుపై సిట్ చేత విచారణ జరిపించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నివేదిక విడుదల చేయలేదని, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో కూడా వెల్లడించలేదని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − two =