చప్ప చప్పగా పవన్ ప్రసంగం..

Where Is That Passion In Pawan,Where Is That Passion,Passion In Pawan,That Passion In Pawan,Mango News,Mango News Telugu,BJP, Janasena, Pawan Kalyan, Pawan Speech, Telangana Assembly Elections,Passion In Pawan Latest News,Pawan Kalyan Latest News,Pawan Kalyan Latest Updates,Pawan Kalyan Live News,Janasena Latest News,Telangana Assembly Elections Latest Updates
pawan kalyan, pawan speech, bjp, janasena, telangana assembly elections

పవన్ కల్యాణ్ ప్రసంగం అంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. స్పీచ్ ఇస్తూనే ఆవేశంతో రగిలిపోతుంటారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతుంటారు. ఓవైపు సినిమా డైలాగులు.. మరోవైపు తూటాల్లాంటి మాటలు పేలుస్తూ.. హీట్ పెంచుతుంటారు. ఏపీలో అధికార పార్టీని ఎండగట్టడంలో ఆయన తర్వాతే మరెవరైనా. వైసీపీ సర్కార్‌పై పవన్ చేసే వ్యాఖ్యలు తూటాల్లో పేలుతుంటాయి. అటువంటి పవన్.. తెలంగాణకు వచ్చేసరికి చల్లబడిపోయారు.  ఎన్నికలవేళ ప్రత్యర్థి పార్టీలపై నేతలు ఎన్నడూ లేనివిధంగా విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్.. చాలా సేఫ్ సైడ్‌గా మాట్లాడారు.

తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు.. పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో పవన్ కల్యాణ్ చాలా బ్యాలెన్స్డ్‌గా మాట్లాడారు. ఏపీలో అధికార పార్టీపై అవకాశం దొరికిన ప్రతిసారి నిప్పులు చెరిగే పవన్.. ఇక్కడ అధికార పార్టీ పేరు కూడా ఎత్తలేదు. సూటిగా ఒక్క విమర్శ కూడా చేయలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో.. ఆ మేరకు విజయం సాధించామా అన్నది క్వశ్చన్‌గానే మిగిలిపోయిందని ఒకే ఒక్క విమర్శ చేశారు.

అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీల తప్పులను ఎండగడుతూ.. తమకు ఓట్లు వేయమని అడుతున్నాయి. కానీ పవన్ కల్యాణ్ బీఆర్ఎస్ మాటే ఎత్తలేదు. కేవలం బీజేపీని గెలిపించండి అని మాత్రమే అన్నారు. అయితే అసలు బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయకూడదో చెప్పి.. ఆ తర్వాత ఎందుకు బీజేపీకి ఓటు వేయాలో చెబితే బాగుండోదని జనాలు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరుగానీ.. కేసీఆర్ పేరుగానీ ఎత్తకపోవడంతో.. సేఫ్ సైడ్‌గా పవన్ ప్రసంగం సాగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా తెలంగాణ ఎన్నికలవేళ పవన్ కల్యాణ్.. లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడారు. మరోసారి మోడీనే దేశ ప్రధాని కావాలని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో మోడీ సాధించిన విజయాల గురించి చెప్పుకొచ్చారు. మరోసారి మోడీ గెలిస్తే.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పారు. అయితే పవన్ ప్రసంగం.. మోడీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించమంటూ చేసిందిగా ఉందని.. తెలంగాణలో బీజేపీని గెలిపించమని చేసినట్లుగా లేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికలవేళ మోడీని గెలిపించమంటూ మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పవన్ ప్రసంగం చాలా చప్పగా ఉందని.. ఊహించినట్లుగా లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 2 =