రాజ్భవన్లో ‘మహిళా దర్బార్‌’ నిర్వహించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని హామీ

Telangana Governor Tamilisai Held Mahila Darbar Program at Raj Bhavan Today, Governor Tamilisai Held Mahila Darbar Program at Raj Bhavan Today, Telangana Governor Held Mahila Darbar Program at Raj Bhavan Today, Mahila Darbar Program at Raj Bhavan Today, Mahila Darbar, Mahila Darbar would be held on the 10th of June, Raj Bhavan, Mahila Darbar at Raj Bhavan on June 10, Governor of Telangana Tamilisai Soundararajan, Telangana Governor, Tamilisai Soundararajan, Telangana Governor Tamilisai Soundararajan, Mahila Darbar Program News, Mahila Darbar Program Latest News, Mahila Darbar Program Latest Updates, Mahila Darbar Program Live Updates, Mahila Darbar on June 10 at Raj Bhavan, Mango News, Mango News Telugu,

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌ వేదికగా మహిళా దర్బార్‌ను నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో మహిళల సమస్యలు తెలుసుకోవాలని గవర్నర్‌ తమిళిసై నిర్ణయించుకున్నారు. దీనికోసం ఈరోజు రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా ‘మహిళా దర్బార్‌’ నిర్వహించారు. మహిళల కోసమే ప్రత్యేకంగా దర్బార్‌ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు పెద్ద ఎత్తున రాజ్భవన్కు చేరుకొని తమ సమస్యలను గవర్నర్ కు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ‍్యలు చేశారు.

  • రాజ్యాంగాన్ని, రాజ్భవన్ను గౌరవించాలి. రాజ్భవన్నే గౌరవించకుంటే.. సామాన్యుల పరిస్థితేంటి?
  • ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వాల ప్రధమ బాధ్యత.
  • గవర్నర్‌ సామాన్య ప్రజలను కలుస్తారా అని చాలామంది అనుమానిస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజలకోసమే ఉన్నాయని గుర్తెరగాలి.
  • ప్రస్తుత కాలంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తే నా గుండె రగిలిపోతోంది.
  • నేను చేసే పోరాటం నా కోసం కాదు, తమ గళం వినిపించలేని బలహీన మహిళల కోసమే.
  • మహిళా దర్బార్‌ వెనుక నాకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు, భవిష్యత్తలోనూ మహిళా దర్బార్‌ కొనసాగిస్తాను.
  • హైదరాబాద్ మైనర్ బాలిక ఘటన కేసులో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా ఇప్పటికీ రాజ్భవన్కు నివేదిక ఇవ్వలేదు.
  • రాజ్‌భవన్‌ నుంచి వచ్చే వినతులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలి.
  • ఒక మహిళగా తెలంగాణ బాధిత మహిళల పక్షాన నిబద్ధతను, ఈ విషయంలో నన్నెవరూ అడ్డుకోలేరు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − five =