చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై, అమ్మవారికి ప్రత్యేక పూజలు

Telangana Governor Tamilisai Soundararajan Visits Charminar Bhagyalaxmi Temple Performs Special Poojas, Telangana Governor Tamilisai Soundararajan Performs Special Poojas In Charminar Bhagyalaxmi Temple, Telangana Governor Tamilisai Soundararajan Visits Charminar Bhagyalaxmi Temple, Telangana Governor Visits Charminar Bhagyalaxmi Temple, Governor Tamilisai Soundararajan Visits Charminar Bhagyalaxmi Temple, Tamilisai Soundararajan Visits Charminar Bhagyalaxmi Temple, Special Poojas In Charminar Bhagyalaxmi Temple, Charminar Bhagyalaxmi Temple, Bhagyalaxmi Temple, Telangana Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan, Tamilisai Soundararajan, Telangana Governor, Charminar Bhagyalaxmi Temple News, Charminar Bhagyalaxmi Temple Latest News, Charminar Bhagyalaxmi Temple Latest Updates, Charminar Bhagyalaxmi Temple Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ బుధవారం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు భాగ్యలక్ష్మి దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ట్రస్టీ చైర్మన్ శశికళ బృందం గవర్నర్‌కు శాలువా కప్పి సత్కరించింది. ఈ క్రమంలో గవర్నర్ తమిళి సై, భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. కాగా హైదరాబాద్ నగరంలోని అతిపురాతన చారిత్రాత్మక కట్టడంగా ఈ ఆలయానికి పేరుంది. ఒకప్పుడు ముస్లిం నవాబుల పాలనలో ఉన్న హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడం చార్మినార్ చెంతనే ఈ ఆలయం ఉండటం విశేషం. శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఐదుసార్లు అమ్మవారికి హారతి ఇవ్వడం ఇక్కడి ఆచారం. అలాగే ముఖ్యంగా బోనాల పండుగ సందర్భంగా ఇక్కడి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here