18 ఏళ్లు పైబడినవారికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై కృతజ్ఞతలు

Telangana Governor Tamilisai Thanked PM Modi for Free Vaccination Initiative, Centre to Provide Free Covid Vaccines, Centre to Provide Free Covid Vaccines to States, Centre to Provide Free Covid Vaccines to States for All Above 18 Years, Centre to Provide Free Covid Vaccines to States for All Above 18 Years From June 21, Free Covid Vaccines, Mango News, Narendra Modi, PM Modi, PM Modi Speech, PM Modi Speech Live Updates, PM Modi to Address the Nation, PM Modi Video Conference, PM Modi Video Conference News, Prime Minister, Prime Minister Narendra Modi

దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ వాక్సినేషన్ చరిత్రలో, కరోనా మహమ్మారిపై పోరాటంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని గవర్నర్ అన్నారు. సోమవారం నాడు జాతినుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం ద్వారా దేశ ప్రజలందరికీ రాబోయే కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి దార్శనికతతో గత సంవత్సరం మే నెలలోనే వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవడం వల్లనే రెండు దేశీయ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏ అభివృద్ధి చెందిన దేశానికీ తీసిపోకుండా భారతదేశం వ్యాక్సిన్ తయారీలో, పంపిణీలో ముందంజలో ఉందని, ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలతో దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుందని డాక్టర్ తమిళిసై అన్నారు.

ప్రధానమంత్రి యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలతో మెడికల్ ఆక్సిజన్ కొరతను అధిగమించామని, అలాగే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని భారతదేశంలో పది రెట్లు పెంచామని గవర్నర్ వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మంది కుటుంబాలకి నవంబర్ వరకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించడం చాలా గొప్ప నిర్ణయం అని గవర్నర్ ఉన్నారు. దేశంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదు అన్న స్ఫూర్తికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు. అలాగే గవర్నర్ సోమవారం రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుదుచ్చేరిలోని అన్ని ప్రాంతాల అధికారులతో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజు వరకు పుదుచ్చేరిలో 100% వ్యాక్సినేషన్ జరగాలని వారికి డాక్టర్ తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =