ఒక్క టైపింగ్ ఎర్రర్‌తో మాలికి చేరిన అమెరికా రహస్యాలు

Millions of Secret US Military Emails Sent to Russian Ally Mali Accidentally by Mistake of Typo Error with One Letter,Millions of Secret US Military Emails Sent,Secret US Military Emails Sent to Russian Ally Mali,Secret US Military Emails Sent Accidentally,Secret US Military Emails by Mistake of Typo Error,Mistake of Typo Error with One Letter,Mango News,Mango News Telugu,Americas Secrets,Americas Secrets That Reached Mali With One Typing Error,US Military Emails Sent of Typo Error with One Letter,US information leaked to Russian,US military emails redirected to Russian ally Mali,Minor Typo Results In Major US Military Secrets,US Military Emails News Today,US Military Emails Latest News

ఒక్క అక్షరం.. ఒకే ఒక్క అక్షరం జీవితాల్ని మార్చేసింది. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది. అవును ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అగ్రరాజ్యమైన అమెరికాకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. తెలుగులోనే కాదు ఇంగ్లీషులో కూడా ఒక్క అక్షరం తేడాతో ఎన్ని చిక్కులు వచ్చి పడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అమెరికా పరిస్థితి కూడా అదే. ఒక్క అక్షరం అమెరికా ఆర్మీ రహస్యాలతో పాటు పాస్వర్డ్స్‌తో సహా వేరే దేశానికి వెళ్లిపోయాయి. పైగా ఆ దేశం కూడా అమెరికాకు శతృదేశంగా తయారైన రష్యా మిత్ర దేశమైన మాలి దేశానికి సెండ్ అయ్యాయి.

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సైనిక రహస్యాలు, మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లు ఉన్న లక్షల కొద్దీ ఈమెయిల్స్‌ రష్యా మిత్రదేశమైన మాలి చేతికి దక్కాయి. దీనికి కారణం ఒక టైపింగ్‌ మిస్టేక్. సాధారణంగా అమెరికా సైన్యం తమ టీమ్స్‌తో కమ్యూనికేషన్ల కోసం.. డాట్‌ ఎమ్‌ఐఎల్‌ (.MIL) అనే ఎక్స్‌టెన్షన్‌ ఉన్న డొమైన్‌ వాడుతుంది. ఐతే… అమెరికా సైన్యంలోని వారు మెయిల్‌ చేసే సమయంలో పొరపాటున డాట్‌ ఎమ్‌ఐఎల్‌కు బదులు డాట్‌ ఎమ్‌ఎల్‌ (.ML)అని టైప్‌ చేయడంతో ఆ మెయిల్స్‌ మొత్తం మాలి డొమైన్‌కు వెళ్లిపోయాయి. వీటిల్లో అమెరికా ఆర్మీ చీఫ్‌ పర్యటనలో బసచేసే హోటల్‌ గది నంబర్ల వంటివి కూడా ఉంన్నాయి.

అమెరికాకు చెందిన ఈ మెయిల్స్.. మాలికి వెళ్లాయని జోహన్నస్‌ జూర్బిర్‌ అనే డచ్‌ వ్యాపారవేత్త గుర్తించాడు. జూర్బిర్​.. మాలి డొమైన్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. దాదాపు 10 ఏళ్ల నుంచి అమెరికా సైన్యం నుంచి లక్షల సంఖ్యలో మెయిల్స్‌ వచ్చినట్లు అతడు తెలిపాడు. మొదట్లో తమ డొమైన్‌లో లేని మెయిల్‌ అడ్రస్‌లకు కూడా డాట్‌ ఎమ్‌ఎల్‌ ఎక్స్‌టెన్షన్‌తో మెయిల్స్‌ రావడాన్ని గమనించాడు. ఆ తర్వాత ఇవి పొరబాటున వస్తున్నట్లు గమనించాడు. దీంతో ఇటువంటి మెయిల్స్‌ను ఓ చోటకు చేర్చడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇటువంటివి 1,17,000 ఈమెయిల్స్‌ వచ్చాయి. వీటిల్లో అమెరికా సైన్యానికి చెందిన మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లు, సైనికుల మెడికల్‌ రికార్డులు, స్థావరాల ఫొటోలు, స్థావరాల్లో సిబ్బంది సంఖ్య, నౌకాదళ కదలికలు, నౌకల్లో సిబ్బంది వివరాలు, పన్ను వివరాలు వంటి కీలకమైన సమాచారం కూడా ఉంది. మెయిల్స్‌ దారి మళ్లుతున్న విషయంపై జోహన్నస్ జూర్బిర్​ చాలా సార్లు అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

ఇక ఈ ఈమెయిల్స్‌లో అమెరికా సైనిక సిబ్బంది, సైన్యంతో కలిసి పనిచేసే ట్రావెల్‌ ఏజెంట్లు, ఇంటెలిజెన్స్ సిబ్బంది, ప్రైవేటు కాంట్రాక్టర్లు, ఇతరులు పంపిన మెయిల్స్ ఎక్కువగా ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం అమెరికా ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ జేమ్స్‌ మెక్‌కాన్వెలీ ఇండోనేషియాలో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన బసచేసిన రూమ్‌ నంబర్ల సంఖ్యలతో సహా ఉన్న ఈమెయిల్‌ కూడా దారి మళ్లింది. దీనిలో గ్రాండ్‌ హయత్‌ జకార్తాలోని రూమ్‌ కీ కలెక్షన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మాలి ప్రభుత్వంతో జోహన్నస్‌ జూర్బిర్‌ కాంట్రాక్టు రీసెంట్‌గా ముగిసింది. దీంతో మాలి ప్రభుత్వమే నేరుగా ఈ డొమైన్‌ను అధీనంలోకి తీసుకొంది. దీంతో దారిమళ్లిన అమెరికా ఈమెయిల్స్ ఆ దేశం సిబ్బంది చూసే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ గతేడాది నుంచి మాలిలోనే ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధానికి అవసరమైన కీలక పరికరాలను రవాణా చేయడానికి దీనిని కీలక మార్గంగా వాడుకొంటోంది. వాస్తవానికి వాగ్నర్‌ గ్రూప్‌ ప్రధాన ఆయుధం సైబర్‌ దాడులే. అలాంటి గ్రూప్‌ చేతికి ఇవి దక్కితే అమెరికాకు తిప్పలు తప్పవు. మరోవైపు ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి టామ్‌ గోర్మన్‌ తెలిపారు. డాట్‌ ఎమ్‌ఐఎల్‌కు వెళ్లకుండా మాలి డొమైన్‌కు వెళుతున్న ఈమెయిల్స్‌ను బ్లాక్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 2 =