హైద‌రాబాద్ కేబీఆర్ పార్కులో ప్ర‌పంచ అట‌వీ దినోత్సవ ఉత్స‌వాలు.. హాజరైన హైకోర్టు చీఫ్ జ‌స్టిస్, ఎంపీ సంతోష్ కుమార్‌

Telangana High Court CJ Participates in World Forest Day Celebrations at Hyderabad's KBR Park, Telangana High Court CJ Participates in World Forest Day Celebrations, Telangana High Court CJ, World Forest Day Celebrations at Hyderabad's KBR Park, High Court CJ, Telangana High Court, Chief Justice of the High Court Of Telangana, Chief Justice of the High Court Of Telangana Participates in World Forest Day Celebrations at Hyderabad's KBR Park, World Forest Day Celebrations at KBR Park, Hyderabad's KBR Park, World Forest Day Celebrations, World Forest Day Celebrations Latest News, World Forest Day Celebrations Latest Updates, World Forest Day Celebrations Live Updates, Chief Justice, Telangana High Court Chief Justice, High Court Chief Justice, Mango News, Mango News Telugu,

నేడు ప్ర‌పంచ అట‌వీ దినోత్సవ సందర్భంగా.. హైద‌రాబాద్ లోని కేబీఆర్ పార్కులో ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ ఉత్సవాలకు హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌, జ‌స్టిస్ పీ న‌వీన్ రావులు హాజరయ్యారు. రాజ్య‌స‌భ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. కేబీఆర్ పార్క్ లో చీఫ్ జ‌స్టిస్ మర్రి మొక్కను, జ‌స్టిస్ న‌వీన్ రావు నేరేడు మొక్కను నాటగా, ఎంపీ సంతోష్ కుమార్ వేప మొక్కను నాటారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వహిస్తున్న అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులు బావున్నాయ‌ని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శంసించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం హరితహారం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్, చీఫ్ జస్టిస్‌కు తెలియజేశారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ప్ర‌పంచ అట‌వీ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కోవడానికి చెట్లను పెంచడమే ఏకైక మార్గం అని ఆయన తెలిపారు. ఈ విశేషాలను సంతోష్ కుమార్ తన ట్విట్టర్ లో పంచుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =