రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఐసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Telangana ICET-2022 Entrance Test Results to be Declared on August 27th at 3 pm in Kakatiya University, ICET-2022 Entrance Test Results to be Declared on August 27th at 3 pm, Kakatiya University, Telangana ICET-2022 Entrance Test Results, ICET-2022 Entrance Test Results, Telangana ICET-2022, TS ICET-2022 results, Telangana State Integrated Common Entrance Test Entrance Test Results, TS ICET 2022 Result Date and time, TS ICET-2022 results News, TS ICET-2022 results Latest News And Updates, TS ICET-2022 results Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2022 ప్రవేశ పరీక్షను జూలై 27, 28వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (ఆగస్టు 27, శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు టీఎస్ ఐసెట్-2022 ఫలితాలు విడుదల కానున్నాయి. ఫైనల్ కీ మరియు పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, టీఎస్ ఐసెట్-2022 చైర్మన్, కాకతీయ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.రమేష్ విడుదల చేయనున్నారు.

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్ లో ఫలితాల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు టీఎస్ ఐసెట్-2022 కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఐసెట్ పరీక్షను 14 ప్రాంతీయ కేంద్రాలలో (తెలంగాణలో 10, ఆంధ్ర ప్రదేశ్‌ లో 4) ఆన్‌లైన్ మోడ్ లో నిర్వహించగా మొత్తం 68,781 మంది విద్యార్థులు హాజరయినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =