రేపటినుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్.. ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనున్న భారత్

Asia Cup 2022 Tournament Starts From Tomorrow Team India To Play Pakistan in First Match on Sunday, 15th edition of cricket's Asia Cup begins on Saturday, Asia Cup 2022 Tournament Starts From Tomorrow, Team India To Play Pakistan in First Match on Sunday, IND vs PAK Asia Cup 2022 Match, India Asia Cup 2022 Match Schedule, Asia Cup 2022, Asia Cup 2022 Tournament, India vs Pakistan, Asia Cup 2022 Tournament News, Asia Cup 2022 Tournament Latest News And Updates, Asia Cup 2022 Tournament Live Updates, Mango News, Mango News Telugu,

క్రికెట్ ఫాన్స్ కు శుభవార్త. ప్రతిష్టాత్మక ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ రేపటినుంచి ప్రారంభం కానుంది. 15వ సారి జరుగనున్న ఈ టోర్నమెంట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆతిథ్యం ఇవ్వనుంది. 3 సంవత్సరాల తర్వాత ఆసియా కప్‌లో భారత్‌కు మరోసారి టైటిల్‌ను కాపాడుకునే అవకాశం లభించింది. ఇప్పటివరకు 14 సార్లు టోర్నీ జరుగగా 7 సార్లు టైటిల్ గెలుచుకుని భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అలాగే శ్రీలంక 5 సార్లు, పాకిస్తాన్ రెండు సార్లు టైటిల్‌ గెలిచింది. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సి ఉండగా ఆ దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులలో నిర్వహణ సాధ్యం కాకపోవడంతో వేదికను యూఏఈకు మార్చారు.

కాగా ఆసియా కప్‌లో ఆరు జట్లు పాల్గొనాల్సి ఉండగా, ఐదు జట్లు శాశ్వత దేశాలుగా ఉన్నాయి. ఇక చివరి స్థానం కోసం సింగపూర్, యూఏఈ, హాంకాంగ్ మరియు కువైట్ టోర్నమెంట్‌లో ఆరవ జట్టుగా అర్హత సాధించేందుకు పోటీ పడతాయి. ఐతే క్వాలిఫయర్ జట్టుతో భారత్, పాకిస్థాన్‌లు గ్రూప్‌-ఏ లో ఆడనుండటం ఆసక్తికరంగా మారింది. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో పోటీపడనున్నాయి. కాగా టోర్నమెంట్ ఆగస్ట్ 27 నుండి సెప్టెంబర్ 11 వరకు జరుగనుంది. ఐతే రేపు జరుగనున్న మొదటి మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్టుతో తలపడనుంది.

ఈ టోర్నమెంట్‌లో.. భారత్ మరియు పాకిస్తాన్ జట్లు ఫేవరేట్లుగా బరిలోకి దిగనున్నాయి. ఈ క్రమంలో టీమిండియా ఆదివారం జరిగే తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇక టీమిండియా రోహిత్ శర్మ సారధ్యంలో ఆడనుండగా పాకిస్తాన్‌కు బాబర్ అజామ్‌ నేతృత్వం వహించనున్నాడు. ఇప్పటికే 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇక టీమిండియా స్టార్ బ్యాట్సమన్ విరాట్ కోహ్లీపై అందరి చూపు నెలకొంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్ ఈ టోర్నీలో ఐనా చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

బీసీసీఐ ప్రకటించిన పూర్తి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేగా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అవేష్ ఖాన్ ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 10 =