తెలంగాణలో ఇంటర్‌ ప్రాక్టికల్స్ వాయిదా, మే 29 నుంచి జూన్‌ 7 వరకు నిర్వహణ

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Etala Rajender about Corona Situation in the State, Mango News, Minister Etala Rajender about Corona Situation in the State, telangana, Telangana Coronavirus, Telangana Health Minister Etala Rajender, Telangana Health Minister Etala Rajender about Corona Situation in the State, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీవరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం (జనరల్), ప్రథమ, ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్) విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా ప్రాక్టికల్స్ ను ప్రస్తుతం వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. థియరీ పరీక్షల నిర్వహణ తర్వాత మే 29 నుంచి జూన్‌ 7 వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలంగాణ ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఒమర్ జలీల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ జారీ, బ్యాచులు, బ్యాచ్ వైజ్ టైం టేబుల్ వంటి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలియజేశారు. మరోవైపు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =