మే 28, 29 తేదీల్లో జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

Covid 19 Vaccination For Journalists, Covid 19 Vaccination For Journalists In Telangana, Covid Vaccination Drive, Covid Vaccination Special Drive, Covid Vaccination Special Drive will be held for Journalists, Covid Vaccination Special Drive will be held for Journalists in Telangana, Covid Vaccination Special Drive will be held for Journalists in Telangana on May 28 29, Covid Vaccine For Journalists, Covid-19 Vaccination, Journalists Recognized as Frontline Workers, Journalists Recognized as Frontline Workers In Telangana, Mango News, telangana, Telangana Govt, Telangana Journalists

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరికి మే 28, 29 తేదీలలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు సమాచార పౌర సంబంధాల శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును తమ వెంట తీసుకొని వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లాలని ఆయన సూచించారు. జిల్లాల్లో గుర్తించిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల జాబితా సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల దగ్గర అందుబాటులో ఉందని అన్నారు.

రాష్ట్రస్థాయి జర్నలిస్టుల కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలుగా ప్రెస్ క్లబ్ సోమాజిగూడ, ప్రెస్ క్లబ్ బషీర్ బాగ్, ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. ఇన్స్టిట్యూట్ జూబ్లీ హిల్స్, యునాని హాస్పిటల్ చార్మినార్ మరియు ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం లను గుర్తించడం జరిగిందని అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో సుమారు 20 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ పొందారని, వారిలో 3700 మంది రాష్ట్రస్థాయి జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + twelve =