జులై నెలలో టీఎస్‌ పీజీఈసెట్-2021‌ నిర్వహణ, షెడ్యూల్‌ విడుదల

Mango News, Telangana PGECET, Telangana PGECET Schedule, Telangana PGECET Schedule Released, Telangana Post Graduate Engineering Common Entrance Test, Telangana Post Graduate Engineering Common Entrance Test Schedule, Telangana Post Graduate Engineering Common Entrance Test Schedule Released, TS PGECET 2021, TS PGECET 2021 Exam Date, TS PGECET 2021 Exam Dates, TSPGECET 2021 Notification

తెలంగాణ రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ/ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్-2021) ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం నాడు విడుదల చేసింది. సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షను జులై 19 నుంచి జులై 22 మధ్య రోజుకు రెండు సెషన్స్ లో నిర్వహించనున్నారు. గురువారం నాడు జరిగిన టీఎస్‌ పీజీఈసెట్ టెస్ట్‌ కమిటీ తొలి సమావేశం అనంతరం షెడ్యూల్ ను ఖరారు చేశారు. 2021 సంవత్సరానికి గానూ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

టీఎస్ పీజీఈసెట్-2021 పరీక్షషెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చి 6
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 12
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : ఏప్రిల్‌ 30
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుముతో) : జూన్ 15
  • హాల్ టికెట్ల డౌన్ లోడ్ : జూన్ 10-జూన్ 18
  • పీజీఈసెట్ పరీక్ష నిర్వహణ : జులై 19 నుంచి జులై 22
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =