భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

Heavy Rains In Telangana, KCR has Reviewed Rain Flood Situation, KCR reviews flood situation, telangana, Telangana CM KCR, Telangana CM KCR reviews flood situation, Telangana Floods Live Updates, Telangana rains, telangana rains news, telangana rains updates

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తునారు. జిల్లాల వారిగా సమాచారం తెలుసుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు కూడా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఈ రోజు (ఆగస్టు 17, సోమవారం) మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేంద్ర రెడ్డి, జల వనరుల శాఖ, విద్యుత్, మున్సిపల్, పంచాయతి రాజ్, వ్యవసాయ, ప్రకృతి వైపరిత్యాల నివారణ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ అవసరమైన సహాయక చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + two =