ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మరో పదేళ్లు పొడిగింపు

AP Govt Issues Ordinance to Extend SC ST Sub Plan for Another 10 Years,AP Govt Issues Ordinance, to Extend SC, ST Sub Plan, for Another 10 Years,Mango News,Mango News Telugu,Ap Ex Minister Kodali Nani,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువును ఏపీ ప్రభుత్వం మరో పదేళ్లు పాటుగా పొడిగించింది. ఈ మేరకు జనవరి 22, ఆదివారం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తీసుకొచ్చింది. ఈ సబ్ ప్లాన్ చట్టాన్ని పదేళ్ల గడువుతో రూపొందించగా, 2013, జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చట్టం గడువు నేటితో (2022, జనవరి 23) ముగియనుండగా, ఒక రోజు ముందుగానే చట్టం గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను కొనసాగించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు స్పందిస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్ మరియు గిరిజన సబ్-ప్లానింగ్ (ప్లానింగ్, కేటాయింపు మరియు ఆర్థిక వనరుల వినియోగం) (సవరణ) ఆర్డినెన్స్, 2023 ను ప్రభుత్వం జారీ చేయగా, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేపట్టనుంది. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ శాఖల్లో నిధులు కేటాయించి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చేయూతను ఇవ్వడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంను అమలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − one =