తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్‌, ఎడ్ సెట్ సహా పలు ప్రవేశపరీక్షల తేదీలు ఖరారు

Telangana: EAMCET-2023 ECET-2023 ICET-2023 and Other Common Entrance Exams Dates Announced,Telangana Entrance Exams,Telangana MSET,Telangana ISET,Telangana ESET,Telangana EdSET,Mango News,Mango News Telugu,Telangana Entrance Exam 2023,B.Ed Entrance Exam 2023 Telangana,Eamcet Tsche Ac In 2023 Results,Pg Entrance Exam 2023 Telangana,Polytechnic Entrance Exam 2023 Telangana,Telangana Engineering Entrance Exam,Telangana Entrance Exam Dates,Telangana Entrance Exam For Mba,Telangana Mba Entrance Exam,Telangana Pg Entrance Exam 2023,Today Exams In Hyderabad 2023,Today Exams In Telangana 2023,Ts Eamcet,Ts Eamcet 2023,Ts Eamcet 2023 Exam Date For Bipc,Ts Eamcet 2023 Registration,Ts Eamcet Counselling

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవ‌త్స‌రానికి గానూ వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు టీఎస్ ఎంసెట్, ఐసెట్, ఈసెట్‌, ఎడ్ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మంగళవారం నాడు తన కార్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర అధికారులతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

కాగా మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష, మే 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లను ఆయా సమయాల్లో విడుదల చేయనున్నారు.

తెలంగాణలో 2023 ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • టీఎస్ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ – మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు
  • టీఎస్ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ – మే 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు
  • టీఎస్ ఎడ్ సెట్ – మే 18
  • టీఎస్ ఈసెట్‌ – మే 20
  • టీఎస్ ఐసెట్ – మే 26
  • టీఎస్ లా సెట్ – మే 25
  • టీఎస్ పీజీ ఎల్ సెట్ – మే 26, 27
  • టీఎస్ పీజీ ఈసెట్‌ – మే 29 నుంచి జూన్‌ 1 వరకు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − three =