దుర్భరంగా గాజాలో జన జీవితం

Life in Gaza is miserable,Life in Gaza,Gaza is miserable,Gaza, Israeli attacks continue, Thousands of Palestinians, escape attacks,Mango News,Mango News Telugu,Voices against Hamas growing louder,Gaza is the most miserable place,Situation in Gaza,Israeli Attacks,miserable people of Gaza live,Gaza Latest News,Gaza Latest Updates,Gaza Live News
Gaza, Israeli attacks continue, Thousands of Palestinians, escape attacks

గాజాలో ప్రజల పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతోంది.  ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉండగా. మరోవైపు వర్షం, చలితో అక్కడి జనాలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అంచనా వేయలేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. గాజాలో ప్రస్తుతం ఎప్పుడు చూసినా వర్షం పడుతూనే ఉంది. దీనికి తోడు మైనస్ డిగ్రీలతో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పాలస్తీనా కుటుంబాల కష్టాలను మరింత పెంచినట్లు అవుతున్నాయి. యుద్ధం వల్ల అక్కడి ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లి.. గుడారాల్లో దాక్కుని జీవిస్తున్నారు. అయితే నిత్యం కురుస్తున్న వర్షాలతో అవి కూడా నీటితో నిండిపోతున్నాయి.

కుండపోత వర్షాలతో  పాలస్తీనియన్లకు కొత్త సవాలును సృష్టించినట్లు అయింది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలతో పాలస్తీనియన్లంతా తమ తమ ఇళ్లను వదిలి దక్షిణం వైపు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు గాజాలో పరిస్థితి నిరంతరం దిగజారిపోతుంది. ప్రస్తుతం గాజాలో ఉన్న పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం గాజాలో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కనీస అవసరాల కోసం కూడా నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆహారం, మందుల కోసం అక్కడి ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్తితి నెలకొంది. దీనికి తోడు నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల అక్కడ ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారయింది.

మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల నుంచి తప్పించుకోవడానికే  వేలాది మంది పాలస్తీనియన్లు దక్షిణం వైపు వెళ్లిపోతున్నారు.  కారు, ట్రక్కు, గుర్రపు బండి లేదా కాలినడకన ఇలా  తమకు వీలైన వాహనాలలో ప్రయాణిస్తూ.. అక్కడి నుంచి పారిపోతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల.. గాజాలో ఇప్పటివరకు 18 వేల మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో సుమారు 1200 మంది ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. హమాస్ దాడి చేయడంతో ఇజ్రాయెల్ కూడా గాజాపై బాంబుల దాడికి దిగింది.  అలా ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడిలో అక్కడి  18 వేల మందికి పైగా మరణించినట్లు అధికారులు గుర్తించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =