రెండు నెలలో ఎన్ని లక్షల విలువైనవి దోచాసారో తెలుసా?

Thieves of blankets and pillows in trains,Thieves of blankets and pillows,Blankets and pillows in trains,Thieves of blankets, pillows in trains, Bhopal Express, Revanchal Express,Mango News,Mango News Telugu, Humsafar Express, Mahamana Express, the passengers,4 lakh were stolen from trains,Thieves primarily targeted passengers,Bedding From Trains,Thieves in Trains Latest News,Thieves in Trains Latest Updates,Humsafar Express Latest News,Humsafar Express Latest Updates
Thieves of blankets, pillows in trains, Bhopal Express, Revanchal Express, Humsafar Express, Mahamana Express, the passengers,

ట్రైన్ జర్నీ చేసినప్పుడు రాత్రి ప్రయాణాలలో సుఖమంతమైన  ప్రయాణాన్ని అందించడానికి రైల్వే శాఖ ఏసీ కోచ్‌లలో దుప్పట్లు, దిండ్లు  సదుపాయాన్నికల్పించింది. అయితే అవసరానికి వాడుకోవాల్సిన వాటిని.. తమ తిరుగు ప్రయాణంలో తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లిపోతున్న ఘటనలే ఎక్కువ జరుగుతున్నాయి. కేవలం ఈ రెండు నెలల్లోనే ఏసీ కోచ్‌ల నుంచి లక్షల విలువైన రగ్గులు, బెడ్‌షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయినట్లు రైల్వే పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఏసీ కోచ్‌లలో చలి వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రయాణించడానికి దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. గరీబ్ రధ్ వంటి ట్రైన్స్‌లో కొంత డబ్బులు తీసుకుని వాటిని అందించడం చేస్తుంటారు. అయితే కొంతమందది  ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తర్వాత .. బెడ్ షీట్లను, రగ్గులను చివరకు దిండ్లను కూడా వారివారి లగేజ్‌తో పాటు పెట్టుకుని వెళ్లిపోతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి.

కేవలం ఈ ట్రైన్స్‌లో ప్రయాణించే ప్రయాణికులే కాకుండా.. ఏసీ కోచ్‌లో ఉండే అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. చివరకు వాష్ రూమ్‌లో ఉండే టాప్స్, మగ్స్ వంటివి కూడా అప్పుడప్పుడు మిస్ అవడగం గమనించినట్లు అధికారులు చెబుతున్నారు. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలోనే ఇలాంటి చోరీలు ఎక్కువ జరిగినట్లు తెలియజేసారు.

భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికులు తమ తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఈ సమయాలలోనే ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అన్ని ట్రైన్స్‌లో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వాళ్లు అర్ధరాత్రి దాటాక వారంతా కూడా పడుకుండిపోతారు. దీంతో 12 గంటలు దాటాక తమ గమ్యస్థానాలకు దిగిన వాళ్లలో చాలామంది  ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు  తెలుస్తోంది.

కేవలం ఈ రెండు నెలల్లోనే రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్‌షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 రగ్గులు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు నెలల్లోనే ఈ రేంజ్‌లో చోరీ అవడంతో ఏడాది లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఇంకెన్ని లెక్కలు తేలుతాయోనని అధికారులు షాక్ అవుతున్నారు.

అయితే  ఇప్పటి వరకు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై  ఎప్పుడూ కూడా పెద్దగా చర్యలు తీసుకోలేదని.. కానీ ఇలాంటి దొంగతనాలను ఆపడానికి  అయినా ఇకపై  కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + five =