వ్యవసాయరంగాన్ని లాభదాయకమైన వ్యాపారరంగంగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం

TS Agriculture Minister Niranjan Reddy Visits Cotton Research Center in State of Texas USA, Telangana Agriculture Minister Niranjan Reddy Visits Cotton Research Center in State of Texas USA, Agriculture Minister Niranjan Reddy Visits Cotton Research Center in State of Texas USA, Minister Niranjan Reddy Visits Cotton Research Center in State of Texas USA, Niranjan Reddy Visits Cotton Research Center in State of Texas USA, Cotton Research Center in State of Texas USA, Texas Cotton Research Center, Cotton Research Center, Texas USA, Telangana Agriculture Minister Niranjan Reddy, TS Agriculture Minister Niranjan Reddy, Agriculture Minister Niranjan Reddy, Minister Niranjan Reddy, Texas Cotton Research Center News, Texas Cotton Research Center Latest News, Texas Cotton Research Center Latest Updates, Texas Cotton Research Center Live Updates, Mango News, Mango News Telugu,

పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంద్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో పత్తి పరిశోధనా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటుగా ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, డాక్టర్ మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీడ్స్ ఎండీ కేశవులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, అమెరికాలో అధిక సాంద్రత పత్తి సాగు బాగుందని, వర్షాధారం ఉంటే హెక్టారుకు 60 నుండి 75 వేల మొక్కలు నాటుతున్నారన్నారు. అలాగే సాగునీటి సదుపాయం ఉంటే హెక్టారుకు లక్ష 10 వేల మొక్కలు, భవిష్యత్ లో హెక్టారుకు లక్ష 40 వేల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఇక్కడి రైతులు పత్తి పంట తర్వాత జొన్న సాగు చేస్తూ పత్తిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారని చెప్పారు.

వ్యవసాయరంగాన్ని లాభదాయక వ్యాపారరంగంగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం:

“వ్యవసాయంలో యాంత్రీకరణ, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు, పెద్ద కమతాలే అమెరికా రైతుల విజయ రహస్యం. మన దేశంలో పాలకులకు ముందుచూపు లేకపోవడం మూలంగా అత్యధిక శాతం మందికి ఉపాధినిచ్చే వ్యవసాయరంగం ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారుతున్నది. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి రాకతో తెలంగాణ రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైన వ్యాపారరంగంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =