పలు కులాలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన నేతలు

TS Assembly Adopted Resolution Requesting the Centre to Include Valmiki Boys 9 other Castes in STs Leaders Thanked CM KCR,TS Assembly Adopted Resolution,Centre to Include Valmiki Boys,9 other Castes in STs Leaders,Thanked CM KCR,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారి కులాలను ఎస్టీల్లో చేర్చాలన్న అసెంబ్లీ తీర్మానం నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా కుల సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసిన నేతల్లో రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గద్వాల కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ వి.అబ్రహాం, వెంకటేశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి సహా ఇతర ప్రాంతాల నేతలు, ఆయా నియోజకవర్గాలకు చెందిన కుల సంఘాల నేతలున్నారు. ముందుగా శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో వాల్మీకి బోయలతో పాటు మరో 9 కులాలను ఎస్టీల్లో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

మరోవైపు పోడు భూముల వ్యవహారానికి సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా, గిరిజనులకు మేలు కలిగే విధంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పోడు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల ప్రజాప్రతినిధులు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, రేఖా నాయక్, బాపూరావు, విఠల్ రెడ్డి, ఆత్రం సక్కు, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fifteen =