వేసవిలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ సజ్జనార్

TSRTC will Made Special Arrangements to Avoid Problems for Passengers during Summer MD VC Sajjanar,TSRTC will Made Special,TSRTC Special Arrangements,Avoid Problems for Passengers,MD VC Sajjanar,Mango News,Mango News Telugu,Tsrtc Bus Enquiry,Tsrtc Official Website,Tsrtc Online,Tsrtc Bus Tracking,Tsrtc Ticket Download,Tsrtc Helpline,Tsrtc Online Booking,Telangana Rtc Bus Timings,Telangana Rtc Bus Pass,Telangana Rtc Challan,Telangana Rtc Chairman,Telangana Rtc Bus Pass Rates,Telangana Rtc Cargo,Telangana Rtc Cargo Charges,Telangana Rtc Bus Tracking,Telangana Rtc Cargo Tracking,Telangana State Rtc

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రానున్న వేసవికాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు టీఎస్ఆర్టీసీ సిద్దమయింది. ఈ మేరకు వేసవిలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ అంశంపై టీఎస్ఆర్టీసీ ఆర్‌ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్‌ల్లో తాగునీరుతో పాటు ఫ్యాన్లు, కూలర్లు, బెంచీలను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు వీసీ సజ్జనార్‌ ఆదేశాలు ఇచ్చారు. అలాగే వేసవిలో పెళ్లిళ్ల సమయంలో రద్దీకి తగిన ఏర్పాట్లు, శుభకార్యాలకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీపై ప్రజలకు అవగాహనా కల్పించడం వంటి అంశాలపై సూచనలు చేసినట్టు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 17 =