ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి సీపీఆర్‌ చేసి కాపాడిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అభినందించిన మంత్రి హరీష్‌రావు, సైబరాబాద్ సీపీ

Minister Harish Rao and Cyberabad CP Stephen Ravindra Appreciates Traffic Police Constable Who Saved Person by Doing CPR,Minister Harish Rao,Cyberabad CP Stephen Ravindra,Appreciates Traffic Police Constable,Who Saved Person by Doing CPR,Mango News,Mango News Telugu,Traffic Police,Traffic Police Hyd,Traffic Police News and Updates,Traffic Police Latest News,Traffic Police Hyd Latest News,Traffic Police Hyderabad,Traffic Police Hyderabad Latest News and Updates

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని ఆరాంగర్ చౌరస్తాలో శుక్రవారం ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అత్యవసర చికిత్సా విధానం పాటించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. దీంతో అతడిపై ప్రతి ఒక్కరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు మరియు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలు కూడా ఈ ఘటనపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ వారు అభినందించారు. ఈ మేరకు మంత్రి హరీష్‌ రావు తన ట్విటర్‌లో ఇలా తెలిపారు.. ‘తక్షణమే సీపీఆర్‌ చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడటంలో ప్రశంసనీయమైన పని చేసినందుకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసు రాజశేఖర్‌ను ఎంతో అభినందిస్తున్నాము. ఇలాంటి సంఘటనల నివేదికలు పెరుగుతున్న దృష్ట్యా వచ్చే వారం అందరు ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు మరియు కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం సీపీఆర్‌ శిక్షణను నిర్వహిస్తుంది’ అని పేర్కొన్నారు.

ఇక మరోవైపు ఘటనపై సైబర్‌బాద్‌ పోలీస్ శాఖ కూడా స్పందించింది. సీపీఆర్‌ చేయడం ద్వారా వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ సమయస్ఫూర్తిని అభినందిస్తూ సైబర్‌బాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర రివార్డును అందజేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ ట్విట్టర్ అధికారిక హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. అందులో.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, ఒక విలువైన జీవితాన్ని రక్షించడంలో అసాధారణమైన వృత్తి నైపుణ్యం మరియు మనస్సు యొక్క ఉనికిని ప్రదర్శించిన శ్రీ రాజశేఖర్ యొక్క ప్రశంసనీయమైన కృషి, క్లిష్ట పరిస్థితిని గుర్తించిన వెంటనే, అతను వ్యక్తికి సీపీఆర్‌ని అందించి, వారు కోలుకోవడానికి దారితీసింది’ అని పేర్కొన్నారు. అలాగే సైబర్‌బాద్‌ సీపీతో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్ రెడ్డి తదితరులు కూడా కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ను అభినందించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు ఉదయం 9.30 గంటల సమయంలో ఆరాంగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న బాలరాజు అనే వ్యక్తికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో రోడ్డుపై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ బాలరాజు పడిపోవడం గమనించి వెంటనే అతని దగ్గరికి చేరుకున్నాడు. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న ఆ యువకుడిని గమనించి సమయస్ఫూర్తితో స్పందించి వెంటనే సీపీఆర్‌ చేశాడు. కొద్దిసేపు ప్రయత్నం తర్వాత పడిపోయిన వ్యక్తి తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. దీంతో అధికారుల సూచన మేరకు వెంటనే అంబులెన్స్ ద్వారా దగ్గరలోని ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించి సీపీఆర్‌ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 7 =