ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Union Minister Rajeev Chandrasekhar Visits BJP Activist Sai Ganesh's Family in Khammam, BJP Activist Sai Ganesh's Family in Khammam, Minister Rajeev Chandrasekhar Visits BJP Activist Sai Ganesh's Family in Khammam, BJP activist Sai Ganeshs suicide in Khammam found an echo in Delhi, Union Minister Rajeev Chandrasekhar, Union Minister, Rajeev Chandrasekhar, Rajeev Chandrasekhar Visits BJP Activist Sai Ganesh's Family in Khammam, Union Minister Visits BJP Activist Sai Ganesh's Family in Khammam, BJP Activist, Khammam BJP Activist, BJP activist Sai Ganesh's suicide in Khammam found an echo in Delhi, BJP activist suicide, BJP activist suicide News, BJP activist suicide Latest News, BJP activist suicide Latest Updates, BJP activist suicide Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలోని ఖమ్మం, రామాయంపేట్‌లో ఆత్మహత్యా ఘటనలను బీజేపీ సీరియస్‌గా తీసుకుంటోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యతో మరణించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చిత్రహింసలు భరించలేకపోతున్నాను అని ఆరోపిస్తూ గణేష్ ఏప్రిల్ 14 న స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటూ రెండు రోజుల తరువాత ఆసుపత్రిలో మరణించాడు. ఈ నేపథ్యంలో అతని కుటుంబంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. సాయి గణేష్ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన అమిత్ షా సానుభూతి వ్యక్తం చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించడం ద్వారా గణేష్ కుటుంబానికి న్యాయం చేయడంలో సహకరించాలని అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈరోజు ఖమ్మంలో పర్యటించారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని, రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నల్లరిబ్బన్లతో నిరసనలు తెలపాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆయన స్వయంగా ప్రస్తుతం ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో ఉన్నారు. అవినీతి మరియు టిఆర్ఎస్ ప్రభుత్వ దుష్పరిపాలనకి వ్యతిరేకంగా యాత్ర మధ్య నిరసనలో తెలుపనున్నారు. తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, తమిళనాడు కో-ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇతర బీజేపీ నేతలతో కలిసి సాయి గణేష్ ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించారు. అదే సమయంలో కేంద్ర హోం మంత్రికి కాల్ ఏర్పాటు చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. గతంలో భారతీయ మజ్దూర్ యూనియన్‌కు జిల్లా కన్వీనర్‌గా కూడా సాయి గణేష్ పనిచేశాడు.

తెలంగాణలోని ఖమ్మం, రామాయంపేట్‌లో ఆత్మహత్యా ఘటనలను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే సాయిగణేష్ కుటుంబ సభ్యులతో పాటు రామాయంపేట ఆత్మహత్య బాధిత కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు పరామర్శించారు. ఖమ్మం ఘటనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాకపోవడం దారుణమని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం, రామాయంపేట్ ఘటనలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల బృందం గవర్నర్‌ తమిళి సైను కోరింది. ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఖమ్మం, రామాయంపేట బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘనందనరావు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − 1 =