వరంగల్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Minister KTR Inaugurates Several Development Programs in Warangal District Today, Minister KT Rama Rao has laid foundations for several development works under the Greater Warangal Municipal Corporation, Several Development Programs in Warangal District, Development Programs in Warangal District, Minister KTR Inaugurating Several Development Programs in Warangal District Today, KTR to launch plethora of developmental works in Warangal District Today, Minister KTR lays foundation for Several Development Programs in Warangal District Today, Minister KTR visit to Warangal, Minister KTR Tour to Warangal, Minister KTR will take part in several developmental works during his one-day visit to Warangal and Hanumakonda districts, Warangal, Warangal Development Programs, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

బుధవారం వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఒకరోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మొత్తం రూ.236 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండ చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ ‌భాస్కర్‌ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఇంకా జిల్లా అధికారులు స్వాగతం పలికారు. మంత్రి సమక్షంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులుగా డీ వినయ్‌భాస్కర్‌, అరూరి రమేష్‌లు కేటీఆర్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వరంగల్ పట్టణంలో స్మార్ట్ సిటీ మిషన్ కింద రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్ రోడ్లను, పబ్లిక్ గార్డెన్స్ లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అలాగే రంగంపేటలో రూ.1.50 కోట్లతో లైబ్రరీ ఆధునికీకరణ మరియు రూ.2 కోట్లతో నిర్మించిన మహిళా సమక్య భవనాలను ప్రారంభించారు. వీటితో పాటు నర్సంపేటలో అన్ని గృహాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అందించటానికి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్మించిన ఎన్పీజీ గ్యాస్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఇక నర్సంపేట ప్రాజెక్టు తర్వాత వరంగల్ పట్టణంలో కూడా పైపుల ద్వారా సహజవాయువు సరఫరా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, హైదరాబాద్ నగరంతో సమానంగా వరంగల్ పట్టణం కూడా అభివృద్ధి చెందుతోందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిరాకరించినా, కేసీఆర్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్లతో వరి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని, రైతుల పట్ల ముఖ్యమంత్రి నిబద్ధతకు ఇదే నిదర్శనమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 2 =