ఈనెల 31 వరకు వరంగల్‌లో సభలు, ర్యాలీలపై నిషేధం.. ప్రకటించిన వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి

Warangal City Police Commissioner Tarun Joshi Bans on Meetings and Rallies in Warangal Upto August 31, Police Commissioner Tarun Joshi Cancelled Gatherings In Warangal, Ban On Gatherings In Warangal, Mango News, Mango News Telugu, Warangal CP Tarun Joshi, Ban On Public Meetings In Warangal, CP Tarun Joshi, Tarun Joshi IPS, Warangal Latest News And Updates, Tarun Joshi News And Live Updates , Public Meetings Ban in Warangal Up To Aug 31st, Bandi Sanjay , BJP State President, Bandi Sanjay Praja Sangrama Yatra,Warangal Public Meetings Ban

వరంగల్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నేటి నుంచి ఇవి అమలులో ఉంటాయని కమిషనర్ వెల్లడించారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రేపు హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టులో విజ్ఞప్తి చేయడం, దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి పాదయాత్ర నిలిపివేయాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసును సస్పెండ్ చేస్తూ బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =