ఉచితంగా 1 లక్ష మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్న హెఛ్ఎండీఏ

HMDA will Distribute 1 Lakh Clay Ganesh Idols This Year Commissioner Arvind Kumar Starts Distribution of Idols Today, Commissioner Arvind Kumar Starts Distribution of Ganesh Idols Today, HMDA will Distribute 1 Lakh Clay Ganesh Idols This Year, 1 Lakh Clay Ganesh Idols, Hyderabad Metropolitan Development Authority, HMDA Commissioner Arvind Kumar, Commissioner Arvind Kumar, Ganesh Idols, Arvind Kumar, 1 Lakh Clay Ganesh Idols News, 1 Lakh Clay Ganesh Idols Latest News And Updates, 1 Lakh Clay Ganesh Idols Live Updates, Mango News, Mango News Telugu,

పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హెఛ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కోరారు. ఈ నెల 31న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలెప్మెంట్ కార్యాలయంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి,అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, సంయుక్త సంచాలకులు డిఎస్.జగన్, డి శ్రీనివాస్, ఉప సంచాలకులు యాసా.వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు ఎం.యామిని, హెఛ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఓ.ఎస్.డిలు శ్రీనివాస్ రావు, రాధ, హెఛ్ఎండీఏ, పురపాలక విభాగాల అధికారులకు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వినాయక నవరాత్రులను మట్టి విగ్రహాలతో అత్యంత వైభవంగా ఇంటింటా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఉచితంగా 1 లక్ష మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్న హెఛ్ఎండీఏ:

పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవటం వలన పిల్లల్లో పర్యావరణము పట్ల అవగాహన, చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2017 నుంచి మట్టి వినాయక విగ్రహాలను హెఛ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నదని, ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని 2017లో 30 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తే, 2022లో 1 లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెఛ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నదని చెప్పారు. నగరవ్యాప్తంగా 39 లొకేషన్స్ తో పాటు 1 మొబైల్ వెహికల్స్ మరియు 5 రెసిడెన్సీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా ఈ నెల 25 నుంచి 30 వరకు హెఛ్ఎండీఏ ద్వారా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అందులోభాగంగా ఈ నెల 29, 30 తేదీల్లో మాదాపూర్ మైండ్ స్పేస్, పెద్ద అంబర్ పేట్ నగర పంచాయతీ ఆఫీస్, కోటక్ మహీంద్రా బ్యాంకు, సికంద్రాబాద్ గణేష్ టెంపుల్, హెఛ్జీసీఎల్ ఆఫీస్ ల వద్ద మట్టి వినాయక విగ్రహాలను హెఛ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో మొబైల్ వెహికల్స్ ద్వారా మియాపూర్ లోని ఎస్ఎంఆర్ వినయ్, మై హోం జూవెల్ పైప్ లైన్ రోడ్, ఇతర గేటెడ్ కమ్మ్యూనిటీస్, ఇందు ఫార్ట్చున్ పరిసర ప్రాంతాలు, కూకట్ పల్లి, కెపిహెచ్ బి, మలేషియన్ టౌన్ షిప్ లలో పంపిణీ చేయనున్నారు. మరో 5 ప్రాంతాల్లో రెసిడెన్సీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. విగ్రహాలు పంపిణికి, పర్యవేక్షణకు ప్రాంతాలు వారిగా ఇంచార్జి అధికారులను నియమించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =