ఒక్క ఛాన్స్ వైపే ఎగ్జిట్ పోల్స్.. మరి కౌంటింగ్ ఫలితాలు?

Will the one chance mantra work for Congress,Will the one chance mantra work,mantra work for Congress,Congress party,votes,Telangana Assembly Elections 2023, assembly seat, BJP,BRS, YCP, one chance mantra, Congress, Exit polls ,counting results,Mango News,Mango News Telugu,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates
Congress party,votes,Telangana Assembly Elections 2023, assembly seat, BJP,BRS, YCP, one chance mantra, Congress, Exit polls ,counting results,

తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది తామేనంటూ చెప్పే కాంగ్రెస్ పార్టీ.. రెండు సార్లు కూడా అదే సెంటిమెంట్ తమను గెలిపిస్తుందని.. తెలంగాణలో అధికారాన్ని ఇస్తుందని  గంపెడాశలు పెట్టుకుంది. కానీ ఈ రెండె సార్లు గులాబీ పార్టీకే తెలంగాణ వాసులు పట్టం కట్టారు. అయితే ఈ సారి మాత్రం బీఆర్ఎస్ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు..ఒక్క ఛాన్స్ అంటూ మరో సెంటిమెంట్ మంత్రాను బయటకు తీసారు. దీనికి తోడు సినిమాల నుంచి రాజకీయాల వరకూ చాలామంది అదే మంత్రాను పాటిస్తూ సక్సెస్ అయ్యారు.

దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హస్తం పార్టీ పెద్దలు ఆ సెంటిమెంటును మరోసారి తెర మీదకు  తీసుకువచ్చారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెసే అంటూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి  ఒక్క ఛాన్స్ ఇవ్వమని హస్తం నేతలు ఈ ఎన్నికల్లో పొలిటికల్ సెంటిమెంట్‌ను రాజేశారు. ఈసారి ఎన్నికలు కాంగ్రెస్‌కు  అత్యంత కీలకం కావడంతో అని విధాలా కూడా హస్తం పార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు.

పోలింగ్ ముగిసింది.. ఎగ్జిట్ పోల్స్ విడుదలయి బీఆర్ఎస్ అభ్యర్ధులలో టెన్షన్‌ను పెంచేశాయి. ఇక మిగిలింది ఫలితాలే కాబట్టి అన్ని పార్టీల నేతల చూపు కౌంటింగ్‌ వైపు మళ్లింది. అయితే హస్తం నేతలు రగిల్చిన ఒక్క ఛాన్స్ సెంటిమెంట్‌ ప్రకారం..  ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తారా లేదా అనేది డిసెంబర్ 3న తేలిపోనుంది. దీంతో గతంలో  ఏ ఏ పార్టీలు ఇదే ఒక్క ఛాన్స్ నినాదంతో ఫామ్‌లోకి వచ్చారో అని ఆరాలు తీస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కూడా ఒక్క ఛాన్స్ అంటూ..  అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఒక్క ఛాన్స్ నినాదం అందుకొనే ఎవరూ ఊహించని  విజయాన్ని నమోదు చేశారు. ఈ సెంటిమెంట్‌కు లొంగే.. వైసీపీకి ఏకంగా 151 సీట్లను కట్టబెట్టారు  ఏపీ ఓటర్లు. ఇప్పుడు జగన్ స్ట్రాటజీనే  తెలంగాణలో కూడా  హస్తం పార్టీ అమలు చేసింది. తమ పార్టీకి  ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే నినాదాన్నే ప్రధాన అస్త్రంగా మలుచుకుని నేతలంతా ఎన్నికల బరిలో నిలిచారు.

తొమ్మిదేళ్ల కాలంలో కుటుంబ పాలనే ఎజెండాగా కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని, అందుకే కేసిఆర్ పాలనకు స్వస్తి పలికి.. కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వమని తెలంగాణ ఓటర్లను వేడుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  హామీలన్నీ నెరవేర్చుతామని ..పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ హామీలను  ప్రమాణ స్వీకారం రోజే అమలు  చేస్తామని గట్టిగా చెబుతూ వస్తున్నారు. అందుకే తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ హస్తం నేతలు వేడుకున్నారు. అదే నినాదంతో వైసీపీకి అధికారమిచ్చిన తెలుగు ఓటర్లు.. తమకూ కూడా ఇస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =