తలసాని హ్యాట్రిక్ కొడుతారా..? సనత్‌నగర్‌లో గెలుపెవరిది..?

Will Thalasani score a hat-trick Who won in Sanatnagar,Will Thalasani score a hattrick,hat-trick Who won in Sanatnagar,Thalasani score a hattrick,Talasani Srinivas yadav, sanathnagar, telangana assembly elections, telangana politics,Mango News,Mango News Telugu,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates
Talasani Srinivas yadav, sanathnagar, telangana assembly elections, telangana politics

గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన నియోజకవర్గం సనత్ నగర్. 1978లో సనత్ నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో అంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందనేది ఉత్కంఠకరంగా మారింది. ఈ సమయంలో సనత్ నగర్ నియోజకవర్గంపై కూడా కీలక చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యాట్రిక్ కొడతారా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఈసారి ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయగా.. బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కోట నీలిమ సహా మొత్తం 16 మంది పోటీకి దిగారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరుపున సనత్ నగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు మరోసారి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సనత్ నగర్ నుంచి బరిలోకి దిగారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా.. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.

అయితే పోలింగ్ సరళిని బట్టి ఈసారి బీఆర్ఎస్, బీజేపీ మధ్యే గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. తలసానికి మురికివాడలు, కాలనీ ప్రజల ఓట్లతో పాటు ఐటీ ఉద్యోగుల ఓట్లు పడ్డాయని.. బీజేపీకి మార్వాడి, గుజరాతి, రాజస్థానీల ఓట్లు పడ్డాయని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. సనత్ నగర్‌లో ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో తలసాని మూడోసారి సనత్ నగర్ నుంచి గెలుపొందుతారా..? హాట్రిక్ కొడతారా..? అన్నదానిపై జనాలు చర్చించుకుంటున్నారు.

అయితే సనత్ నగర్‌లో ఏ పార్టీ అభ్యర్థి కూడా ఇప్పటి వరకు హ్యాట్రిక్ సాధించిన దాఖలాలు లేవు. 1992, 1994 ఎన్నికల్లో రెండుసార్లు గెలుపొందిన మర్రి శశిధర్ రెడ్డి 1999లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలనుకున్నారు. కానీ శ్రీపతి రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలై.. హ్యాట్రిక్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత 2004, 2009లో శశిధర్ రెడ్డి వరుసగా సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. కానీ ఈసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇలా సనగ్ నగర్ నుంచి ఏ ఒక్కరూ కూడా హ్యాట్రిక్ సాధించలేదు. మరి ఈ ఘనతను తలసాని శ్రీనివాస్ యాదవ్ సాధిస్తారా?.. అనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే..

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =